అమెరికాను తక్కువ చేసి... భారత్‌ను పొగిడినందుకు: స్వాతి దేవినేనిపై తెలుగు ఎన్ఆర్ఐ ఫిర్యాదు

కోవిడ్ 19 ధాటికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, సంపన్నమైన అమెరికా చిగురుటాకులా వణికిపోతున్న సంగతి తెలిసిందే.కరోనా తమను ఏం చేయలేదులేనన్న ట్రంప్ నిర్లక్ష్యం, మితిమీరిన ఆత్మవిశ్వాసం అమెరికన్ ప్రజల ప్రాణాల మీదకి తీసుకొచ్చింది.

 Swathi Devineni, America, India, Trump, Corona Issue, Youtube, Social Media, Vir-TeluguStop.com

ఆదివారం నాటికి అక్కడ దాదాపు ఐదు లక్షల మంది ఈ వైరస్ బారినపడగా, 20 వేలకు దగ్గర్లో మరణాలు నమోదయ్యాయి.

ఈ క్రమంలో కరోనాను కట్టడి చేయడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందని.

కానీ భారతదేశంలో మాత్రం కట్టుదిట్టమైన చర్యలు, లాక్‌డౌన్, భారతీయుల జీవన విధానాన్ని పొగుడుతూ కొద్దిరోజుల క్రితం స్వాతి దేవినేని అనే తెలుగు ఎన్ఆర్ఐ ఓ వీడియో రూపొందించారు.అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

అయితే దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మరో తెలుగు ఎన్ఆర్ఐ శ్రవంత్ ఆమెపై న్యూజెర్సీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్‌బుక్‌లో వెల్లడించాడు.

భారత్‌ను పొగుడుతూ.అమెరికాపై విద్వేషాన్ని పెంచేలా స్వాతి దేవినేని వ్యాఖ్యలు చేశారని శ్రవంత్ అన్నాడు.

అమెరికాలో 20 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి నిజమే కానీ దాని ఆధారంగా అమెరికా.ప్రజలను కాపాడటంలో విఫలమైందని వ్యాఖ్యలు చేయడం సరికాదని శ్రవంత్ అన్నాడు.

అందుకే స్వాతి దేవినేనిపై న్యూజెర్సీలోని సౌత్ ప్లేన్ ఫీల్డ్ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.ప్రస్తుతం కరోనా కారణంగా అక్కడి న్యాయస్థానాలు మూతపడినందున పరిస్ధితి అదుపులోకి వచ్చినప్పుడు విచారణ జరుగుతుందని శ్రవంత్ స్పష్టం చేశాడు.

మరోవైపు శ్రవంత్ ఫిర్యాదుపై స్పందించిన స్వాతి దేవినేని.తాను అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పారు.నిజానికి అది తన ఉద్దేశ్యం కాదని… అమెరికాలో కరోనా విజృంభణకు కారణాలు ప్రపంచానికి తెలియజెప్పేలా ఓ య్యూబ్ ఛానెల్ పంపిన స్క్రిప్ట్‌ను తాను చదివానని ఆమె వెల్లడించారు.భారతీయులు ఆర్ధికంగా ఎదగడానికి అమెరికా ఎంతగానో సహాయపడిందో తనకు తెలియని విషయం కాదన్నారు.

అయితే యూట్యూబ్ ఛానెల్ స్క్రిప్ట్‌ను చదువుతున్న సమయంలో ఈ వీడియోపై లోగో లేకుండా ప్రసారం అయ్యిందని స్వాతి చెప్పారు.అమెరికా అంటే తనకు ఎంతో గౌరవం వుందని, తాను నివసిస్తున్న దేశాన్ని తిట్టేంత సంస్కారం హీనురాలిని కాదన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube