తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.భారత ప్రయాణికులకు అబుదాబి కొత్త రూల్స్

Telugu America, Brics, Canada, Indians, Latest Nri, Nri, Nri Telugu, Taliban, Te

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చే భారత ప్రయాణికులకు అబుధాబి కొత్త మార్గ దర్శకాలను విడుదల చేసింది.ఇతర ఎమిరేట్స్ ( దుబాయ్ ,షార్జా, అజ్మన్ , ఉమ్ అల్ క్వైన్ , పుజిరహ ) జారీ చేసిన వీసాలు కలిగిన భారత ప్రయాణికులకు అబుధబిలో ఎంట్రీ కి అనుమతి ఇచ్చింది.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians, Us, Immi-TeluguStop.com

2.  కెనడాలో పరిస్థితి పై భారత్ ఆందోళన

ఉపాధి నిమిత్తం కెనడా వెళ్లిన భారత యువకుడు ప్రభాజోత్ సింగ్ కత్రిని అతని నివాసంలో హత్య చేయడంపై భారత హై కమిషన్ స్పందించింది.కెనడాలోని భారత పౌరులను జాతి వివక్ష దాడుల నుంచి కాపాడాలని కోరింది.

3.తానా ఆధ్వర్యంలో ‘ తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు’

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా ) సాహితీ విభాగం ‘ తానా ప్రపంచ సాహిత్య వేదిక ‘ అధ్వర్యంలో ప్రజా కవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ‘ తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు సెప్టెంబర్ 9 న తేదీన అంతర్జాతీయ వేదికగా ఘనంగా జరిగాయి.

4. గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసు లో హైదరాబాదీ

Telugu America, Brics, Canada, Indians, Latest Nri, Nri, Nri Telugu, Taliban, Te

ప్రఖ్యాత గ్లోబల్ టీచర్ ప్రైస్ పోటీలు ఇద్దరు భారతీయ ఉపాధ్యాయులు షార్ట్ లిస్ట్ అయ్యారు.హైదరాబాద్ కు చెందిన మేఘన ముసునూరు తోపాటు బీహార్ కు చెందిన టీచర్ సత్యం మిశ్రా లు ఈ ఏడాది రేసులో ఉన్నారు.

5.భారత గోల్ఫ్ కు యూఏఈ

ప్రముఖ భారత గోల్ఫర్ , పద్మ శ్రీ అవార్డు గ్రహీత జీవ్ మిల్క్ సింగ్ కు అరుదైన గౌరవం దక్కింది.యూఏఈ  మిల్కా ను పదేళ్ల గోల్డెన్ వీసాతో సత్కరించింది.

6.తాలిబన్ ప్రభుత్వ వేడుకలకు రష్యా దూరం

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల నూతన ప్రభుత్వ ఏర్పాటు వేడుకలకు తాము హజరుకాబోమని రష్యా స్పష్టం చేసింది.

7.అమెరికా నిషేధిత జాబితా నుంచి తమను తొలగించాలి : తాలిబన్లు

Telugu America, Brics, Canada, Indians, Latest Nri, Nri, Nri Telugu, Taliban, Te

ఆఫ్ఘన్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్ లు హక్కానీ నేతలు అమెరికా నిషేధిత జాబితా నుంచి తమను తొలగించాలని డిమాండ్ చేశారు.

8.ఆర్టి పీసీఆర్ టెస్ట్ కిట్ ధర తగ్గింపు

తమ వెబ్సైట్ ద్వారా అమ్ముతున్న ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ కిట్ ధర తగ్గిస్తున్నట్లు అమెజాన్.కామ్ ప్రకటించింది.

9.సురక్షిత డిజిటల్ విధానాలు రూపొందించాలి : బ్రిక్స్ నివేదిక

Telugu America, Brics, Canada, Indians, Latest Nri, Nri, Nri Telugu, Taliban, Te

సంబంధిత వర్గాల నమ్మకం పొందేలా సభ్యదేశాల్లో అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకువచ్చి,  చాలా సురక్షితమైన డిజిటల్ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని బ్రిక్స్ కూటమి ఒక నివేదికలో పేర్కొంది.

10.యూ ఎన్ ఓ బెస్ట్ టూరిజం పోటీల్లో నిలిచిన పోచంపల్లి

ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ ( యూయెన్ డబ్ల్యూ.టి.ఓ) నిర్వహించే బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్ కు మన దేశం నుంచి తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి గ్రామం కూడా పోటీలో నిలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube