తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్

1.కెనడాలో వింత వ్యాధి పసుపురంగులో నాలుక

కెనడాలో ఓ 12 ఏళ్ల వయసున్న బాలుడికి అరుదైన వ్యాధి సోకింది.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians, Us, Immi-TeluguStop.com

కొద్దిరోజులుగా తీవ్రమైన గొంతు నొప్పి శరీరం నాలుక రంగులోకి మారడం కడుపునొప్పి వంటి సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు.ఆ బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా రక్తహీనతతో పాటు, ఎప్పీన్ వైరస్ ను బాలుడి శరీరంలో గుర్తించారు. కోల్డ్ అగ్లుటనిన్ అనే వ్యాధితో బాలుడు బాధపడుతున్నట్లు నిర్ధారించారు.

2.సింగపూర్ లో బోనాల పండుగ

బోనాల పండుగ ను సింగపూర్ లో ఘనంగా నిర్వహించారు.తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న సుంగే కేడుట్ లోని శ్రీ అరస కేసరి శివన్ దేవాలయంలో ఈ వేడుకలను నిర్వహించారు.

3.తాలిబన్ల భయంతో దేశమంతా కర్ఫ్యూ

Telugu Afghan, Britain, Canada, Donaldtrump, Indians, Latest Nri, Uk, Nri, Nri T

తాలిబన్ల ఆధీనంలోకి నగరాలు వెళ్ళకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాదాపు దేశమంతా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించింది.

4.పెగసస్ ప్రమాదకరమే ! అమెరికా ఆందోళన

వివాదాస్పద పెగసస్ స్పై వేర్ పై ఇజ్రాయిల్ కంపెనీ స్పందించింది.ప్రపంచం నిర్భయంగా ఉండడానికి కారణం పెగాసస్ సాఫ్ట్ వేర్ అంటూ ఇజ్రాయిల్ అంటుండగా దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

5.బ్రిటన్ నుంచి విజయ్ మాల్యా అప్పగింతకు ఓకే

Telugu Afghan, Britain, Canada, Donaldtrump, Indians, Latest Nri, Uk, Nri, Nri T

పారిశ్రామిక వేత్త, ఆర్థిక నేరస్థుడు విజయ మాల్యాను అప్పగించేందుకు సర్వం సిద్ధమైంది.ఆయనను అప్పగించేందుకు బ్రిటన్ అధికారులు తనకు హామీ ఇచ్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ షింగ్లా తెలిపారు .

6.పెరు పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం

పేరు నూతన పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని శుక్రవారం నిర్వహించారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగిన ప్రారంభ సమావేశంలో 10 పార్టీలకు చెందిన 130 మంది కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

7.యూకే గబ్బిలాల్లో కొత్త కరోనా వైరస్

యూకే గబ్బిలాల నుంచి కొత్త కరోనా వైరస్ విజృంభిస్తున్న ట్లు పరిశోధకులు కనుగొన్నారు.యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా, పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.

8.అమెరికాలో భారతీయురాలి ఘనత

Telugu Afghan, Britain, Canada, Donaldtrump, Indians, Latest Nri, Uk, Nri, Nri T

 అమెరికాలో ప్రతిష్టాత్మకమైన కాంగ్రెషనల్ ఆసియా పసిఫిక్ అమెరికన్ కాకస్ ( సీఏపీఏసీ ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఇండో-అమెరికన్ మహిళ నిషా రామచంద్రన్ ఎన్నికయ్యారు.

9.ట్రంప్ మిత్రుడికి కోర్టు షాక్

Telugu Afghan, Britain, Canada, Donaldtrump, Indians, Latest Nri, Uk, Nri, Nri T

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మిత్రుడు టామ్ బరాక్ బెయిల్ పై విడుదలయ్యారు.యూఏఈ కి అనుకూలంగా ఆ దేశానికి ఏజెంట్ల పని చేశారని ఆరోపణలపై ఆయన అరెస్టు కావడంతో, 250 మిలియన్ల డాలర్ల బాండ్లు తోపాటు, ఐదు మిలియన్ డాలర్ల నగదు కోర్టుకు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు ఇవ్వడంతో ఆయన ఆ మొత్తాన్ని చెల్లించి బెయిల్ పై విడుదల అయ్యారు.

10.సౌదీలో ఆరుగురు భారతీయుల అరెస్ట్

యజమానిని మోసం చేసిన కేసులో ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే అరెస్టయిన భారతీయుల వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు.

11.ఎప్పుడో గిన్నిస్ కెక్కిన కుక్క… ఇప్పుడు వైరల్

కేవలం 39.08 సెకండ్లలో 100 బెలూన్ల పగలగొట్టి ట్వింకీ జాక్ రస్సెల్ ఓ  టెర్రియార్ జాతి కుక్క అమెరికాలోని కాలిఫోర్నియా లో ఏర్పాటుచేసిన పోటీల్లో రికార్డును సొంతం చేసుకుంది.దీంతో పాటు గిన్నీస్ లోనూ స్థానం సంపాదించుకుంది.

అయితే ఈ వీడియో 2014 లోనిది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube