తెలుగు ఎన్.ఆర్.ఐ  డైలీ న్యూస్ రౌండప్

1.దుబాయ్ లో భారతీయుడుకి జాక్ పాట్

దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లో ఓ భారతీయుడు జాక్ పాట్ కొట్టాడు.గణేష్ షిండే అనే భారతీయ వ్యక్తి ఒక మిలియన్ డాలర్లు ( 7.45 కోట్లు ) గెలుచుకున్నాడు.మిలీనియం మిలీనియర్ సిరీస్ 363 లో భాగంగా తీసిన ఈ లాటరీ టికెట్ కు ఈ జాక్ పాట్ తగిలింది.గణేష్ స్వస్థలం మహారాష్ట్రలోని థానే కాగా  ఇతడు దుబాయ్ లో నావికుడిగా పనిచేస్తున్నారు.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians, Us, Immi-TeluguStop.com

2.భారత్ తో సహా ఏడు దేశాలపై నిషేధం పొడిగింపు

Telugu Canada, Covid Funds, Hb Visa Policy, Indians, Latest Nri, Nri, Nri Telugu

భారత్ తో సహా ఏడు దేశాలపై ట్రావెల్ బ్యాన్ పొడిగిస్తున్నట్లు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఈరోజు వెల్లడించింది.

3.తానా ప్రపంచ సాహిత్య వేదిక సమావేశం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా ) ప్రపంచ సాహిత్య వేదిక లో ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహించే అంతర్జాతీయ దృశ్య సమావేశంలో భాగంగా 15వ సమావేశం ఈనెల 25న జరుగుతుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు హాజరవుతారని తానా ప్రకటించింది.

3.ప్రవాసాంధ్రుల ఔదార్యం

Telugu Canada, Covid Funds, Hb Visa Policy, Indians, Latest Nri, Nri, Nri Telugu

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కోవిడ్ సంబంధిత ఔషధాలు,  మెడికల్ ఎక్విప్మెంట్ లను విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ డొనేట్ చేసింది.కాలిఫోర్నియాలోని హన్ ఫోర్ట్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పాటుపడుతోంది.

4.దక్షిణాఫ్రికాలో భారతీయుల పై దాడులు

దక్షిణాఫ్రికాలో భద్రతా దళాలు – ఆందోళనకారుల మధ్య జరుగుతున్న ఘర్షణలు శ్రుతి మించాయి.

ఇక్కడ స్థిరపడిన భారతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుండటంతో ఆందోళన నెలకొంది.దక్షిణాఫ్రికాలో దాదాపు 20 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.ఈ ఆందోళన అదుపుచేసేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది.

5.భారతీయత పై సుందర్ పిచాయ్ ఉద్వేగం

గూగుల్ సీఈఓ గా వ్యవహరిస్తున్న భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ భారత్ గురించి చెబుతూ ఉద్వేగానికి గురయ్యారు.భారత్ లో కరోనా సెకండ్ వెక్ పరిస్థితులను చూసి తాను కంటతడి పెట్టానని బిబిసి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు.

6.కెనడాకు భారత యువత.ఇమ్మిగ్రేషన్ నిపుణుల హెచ్చరిక

Telugu Canada, Covid Funds, Hb Visa Policy, Indians, Latest Nri, Nri, Nri Telugu

హెచ్వన్ బి వీసా విధానం కారణంగా అమెరికా నుంచి ప్రతిభావంతులైన భారతీయులు కెనడా వైపు ఆకర్షితులు అవుతున్నారు అని,  ఇమ్మిగ్రేషన్ విధాన నిపుణులు అమెరికా చట్టసభ సభ్యులను హెచ్చరించారు.

7.అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి

అమెరికాలోని వాషింగ్టన్లో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏలేటి నీహార్ రెడ్డి (32) ఓ జలపాతం వద్ద కాలు జారి గల్లంతు అయ్యారు.మంగళవారం రాత్రి ఆయన మృతదేహం లభించింది.

8.తెలంగాణ విద్యార్థికి అమెరికా లో 2 కోట్ల స్కాలర్ షిప్

Telugu Canada, Covid Funds, Hb Visa Policy, Indians, Latest Nri, Nri, Nri Telugu

తెలంగాణకు చెందిన శ్వేతా రెడ్డి అనే 17 ఏళ్ల విద్యార్థికి అమెరికాలోని లాఫాయేట్ కాలేజీ రెండు కోట్ల స్కాలర్ షిప్ ప్రకటించింది.ఈ కాలేజీ ” డైయర్ ఫెలో షిప్ ” పేరిట స్కాలర్ షిప్ లు ప్రకటిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు మాత్రమే దీనికి ఎంపికయ్యారు.

9.తానా ‘ పాఠశాల ‘ కు భారీ విరాళం

అమెరికాలోని తానా కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తెలుగు భాషను నేర్పించే పాఠశాల కు దాదాపు కోటి యాభై లక్షల విరాళాన్ని  తానా మాజీ అధ్యక్షుడు ఆలూరు జయశంకర్ ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube