తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.కమల హరీష్ కు భారత్ ఆహ్వానం

అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హరీస్ ను భారత్ లో పర్యటించాల్సిందిగా  ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

 Telugu Nri America Dubai Canada News Roundup Breaking Headlines Latest Top News September 24 2021-TeluguStop.com

2.కువైట్ లో కొత్త పాలసీ

తమ దేశంలోకి వచ్చే వలస వాసులకు విద్యార్హతలను బట్టి ఉద్యోగాలను 1855 రకాలుగా విభజించినట్లు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ తమ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది.

3.కరోనా మృతులకు అమెరికాలో తెల్ల జెండాలతో నివాళి

అమెరికాలో కోవిడ్ తో మరణించిన వారి జ్ఞాపకాలను శాశ్వతం చేసేందుకు అమెరికా ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.కోవిడ్ మృతులకు నివాళులు అర్పించేందుకు అమెరికా రాజధాని వాషింగ్ టన్ డి.సి లోని నేషనల్ మాల్ మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.20 ఎకరాల భారీ విస్తీర్ణం లోని మైదానంలో తమ వారి కోసం ప్రత్యేక మెసేజ్ రాసి ఉంచిన తెల్ల జెండాలను ప్రదర్శించుకునేందుకు అనుమతించారు.

 Telugu Nri America Dubai Canada News Roundup Breaking Headlines Latest Top News September 24 2021-తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4 ఇస్లామిక్ చట్టాల ప్రకారమే శిక్షలు

ఆఫ్ఘనిస్థాన్ లో ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేసేందుకు తాలిబన్లు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశారు.చట్టాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చేతులు కాళ్లు నరకడం బహిరంగంగా ఉరి తీయడం వంటివి కొత్త చట్టంలో ఉన్నాయి.ఇస్లామిక్ చట్టాల ప్రకారమే శిక్షలు ఉంటాయని తాలిబన్లు ప్రకటించారు.

5.సాధారణ జలుబు గా కరోనా

వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి కరోనా సాధారణ జలుబు గా మారిపోతుందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ బెల్ ప్రకటించారు.

6.నేడు అమెరికా అధ్యక్షుడితో భారత ప్రధాని సమావేశం

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తో సమావేశం కానున్నారు.

7.ఎన్.ఆర్.ఐ లే ఎంతో ప్రత్యేకం : మోదీ

అమెరికా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ కి వాషింగ్టన్ విమానాశ్రయంలో పలువురు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.  దీన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్.ఆర్.ఐలే మన దేశ బలమని ప్రధాని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

8.డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో భారత్ కు 59 వ స్థానం

డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ లో భారతదేశం 59 వ స్థానాన్ని సంపాదించింది.

9.అమెరికాలో కాల్పులు

అమెరికాలో టెన్నిసెసి సూపర్ మార్కెట్ లో కాల్పులు కలకలం సృష్టించాయి.అగంతకుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా 12 మంది గాయాలపాలయ్యారు.

10.డెల్టా వేరియంట్ భయం

డెల్టా వేరియంట్  ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం డెల్టా వేరియంట్ కేసులే ఎక్కువగా ఉన్నాయి.

#PM Modi #Corona America #Indians #Delta Variant #NRI

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు