తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.అమెరికాలో ఘనంగా వినాయక నిమజ్జనం

అమెరికా ఫ్రీ అమౌంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది.

 Telugu Nri America Dubai Canada News Roundup Breaking Headlines Latest Top News September 19 2021-TeluguStop.com

2.  భారత్ నుంచి కువైట్ కు మరో రెండు విమాన సర్వీసులు

భారత్ నుంచి కువైట్ కు ఏడు నెలల తర్వాత విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి దీంతో ప్రయాణికుల రద్దీ పెరగడంతో మరో రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఇరు దేశాల విమానయాన సంస్థలు ప్రకటించాయి.

3.కువైట్ లో భారీగా ప్రవాసుల అరెస్ట్

కువైట్ లో నిబంధనలు ఉల్లంఘించిన రెసిడెన్సి వలస దారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

 Telugu Nri America Dubai Canada News Roundup Breaking Headlines Latest Top News September 19 2021-తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న వారిని అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు.ఒక్క వారంలోనే 500 మంది ప్రవాసీ లను ఈ విధంగా అరెస్ట్ చేసినట్లు కువైట్ ప్రకటించింది.

4.లాటరీ విధానంలోనే అమెరికాలో వీసాల జారీ

అమెరికాలో ఇక వీసాలో ఎందుకు లాటరీ విధానం సరికాదని వేతన పరిమితిని బట్టి వీటిని జారీ చేయాలంటూ అమెరికా పౌరసత్వం వలస సేవల విభాగం ప్రతిపాదించింది అయితే ఈ నిర్ణయాన్ని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యతిరేకించింది.దీనిని కొట్టివేయాలంటూ 2020లో క్యాలిఫోర్నియా డిస్ట్రిక్   కోర్టును ఆశ్రయించింది.దీనిపై అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ కు అనుకూలంగా తీర్పు వెలువడడంతో పూర్వపు లాటరీ విధానంలోనే వీసాలు జారీ చేయనున్నారు.

5.భారత్ పాక్ సింధు జల ఒప్పందానికి 61 ఏళ్ళు

 భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందంపై సంతకాలు చేసి ఈ రోజుకు 61 ఏళ్ళు పూర్తయ్యాయి.

6.సురక్షితంగా ల్యాండ్ అయిన అంతరిక్ష పర్యాటకులు

ఇటీవల పాల్కాన్ 9 రాకెట్ ద్వారా నలుగురు సామాన్య టూరిస్టులను స్పేస్ ఎక్స్ సంస్థ రోదసీలోకి పంపింది.భూ కక్ష్యలో ఏ క్యాప్సిల్స్ మూడు రోజుల పాటు భూమి చుట్టూ పరి భ్రమించి ఈరోజు సురక్షితంగా భూమి మీదకు చేరింది.

7.కమల హరీష్ ను కలవనున్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హరీష్ ను కలవనున్నారు.సెప్టెంబర్ 24న జరగనున్న సమావేశానికి ముందస్తుగా భేటీ కానున్నారు.

8.వలసదారుల కోసం విమానాలను పునరుద్ధరిస్తున్నాం : అమెరికా

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ టెక్సాస్ సరిహద్దు ప్రాంతంలోని డెల్ రియోలో వరదల్లో చిక్కుకున్న వేలాది మంది వలసదారులను తరలించేందుకు విమానాలను ఏర్పాటు చేశామని చెప్పారు.అయితే కరోనా వైరస్ ప్రభావంతో ఆ విమానాలను రద్దు చేయగా మళ్ళీ వాటిని పునరుద్ధరించారు.

9.లాక్ డౌన్ పై ఆస్ట్రేలియాలో నిరసనలు

ఆస్ట్రేలియా లో లాక్ డౌన్ ఎత్తివేయాలని వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

10.అమెరికాపై ప్రాన్స్ ఆగ్రహం

సాంప్రదాయ జలాంతర్గాముల కొనుగోలు వ్యవహారం అమెరికా ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాల పై తీవ్ర ప్రభావం చూపుతోంది.66 బిలియన్ డాలర్ల విలువైన 12 డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించి 2016 లో ఆస్ట్రేలియా ఫ్రాన్స్ తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది.అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా కొత్త ‘ ఆకస్ ‘ కూటమి పరోక్షంగా ఈ కొనుగోలు ఒప్పందం రద్దు కు దారి తీసింది.

#NRI #Taliban #NRI #HBVisa #ModiMeet

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు