తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

Telugu Nri America Dubai Canada News Roundup Breaking Headlines Latest Top News October 20 2021

1.మలేషియా లో తెలుగు యువకుడి గల్లంతు

మలేషియాలో సముద్రంలో పడి సూర్యాపేట జిల్లా యువకుడు గల్లంతయ్యాడు.హ్యాపీలీ నంబర్ వన్ కన్స్ట్రక్షన్ కి చెందిన వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్న రిషి వర్ధన్ రెడ్డి ఈనెల 17న ప్రమాదానికి గురయ్యాడు.

 Telugu Nri America Dubai Canada News Roundup Breaking Headlines Latest Top News October 20 2021-TeluguStop.com

2.మస్కట్ లోని ఇండియా ఎంబసీ కీలక సూచన

ఒమన్ పౌరులు భారత్ వచ్చేందుకు టూరిస్ట్ విశాల కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

3.ఫేస్ బుక్ కి 50 మిలియన్ యూరోల ఫైన్

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు భారీ జరిమానా పడింది.సమాచారాన్ని దుర్వినియోగం చేశారని బ్రిటన్ కు చెందిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ అనే సంస్థ ఫేస్ బుక్ కు 50 మిలియన్ యూరోల జరిమానా విధించింది.

 Telugu Nri America Dubai Canada News Roundup Breaking Headlines Latest Top News October 20 2021-తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.కువైట్ లో ప్రవాసుల దేశ బహిష్కరణ

రెసిడెన్సీ గడువు ముగిసినా కూడా చట్ట విరుద్ధం గా దేశంలో ఉంటున్న ప్రవాసులతో పాటు, ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై ఆదేశ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.ఈ విధంగా గడిచిన 47 రోజుల్లో 2,739 మంది ప్రవాసులకు దేశ బహిష్కరణ విధించారు.

5.అమెజాన్ లో లక్షన్నర ఉద్యోగాలు

అమెరికా లో హాలిడే సీజన్ దగ్గర పడుతుండడంతో ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సీజనల్ ఉద్యోగాల నియామకానికి సిద్ధం అయ్యింది.దాదాపు లక్షన్నర ఉద్యోగులను తాత్కాలికంగా నియమించుకోబోతోంది.

6.ఆఫ్ఘన్ జూనియర్ వాలీబాల్ క్రీడాకారిణి తల నరికిని తాలిబన్లు

ఆఫ్ఘన్ దేశ జాతీయ జూనియర్ వాలీబాల్ క్రీడాకారిణి మహాజాబిన్ హకిమి తల నరికి ఆమెను దారుణంగా చంపినట్టు ఆ టీమ్ కోచ్ ఆఫ్జలి తెలిపారు.

7.కాశ్మీర్ లో పెట్టుబడులకు దుబాయ్ సిద్ధం

కాశ్మీర్ లోయలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ సిద్ధం అయ్యింది.కాశ్మీర్ లోయలో ఐటి టవర్ తో పాటు , లాజిస్టిక్ పార్క్, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

8.భారత్-పాక్ సరిహద్దుల్లో భారీగా ఆయుధాలు స్వాధీనం

పంజాబ్ లోని భారత్-పాక్ సరిహద్దుల్లో అక్రమంగా తరలిస్తున్న ఆయుధాలను పెద్ద ఎత్తున బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

9.100 రాకెట్ లాంచర్ లను సరిహద్దు కు తరలించిన చైనా

భారత సరిహద్దు లకు భారీ ఎత్తున ఆయుధాలను చైనా తరలిస్తుంది.తాజాగా భారత్ సరిహద్దు వెంబడి వంద అత్యాధునిక దీర్ఘ శ్రేణి రాకెట్ లాంచర్ లను చైనా మోహరించింది.

10.ట్రిలినియర్ కాబోతున్న ఎలన్ మస్క్

టెస్లా ఎలక్ట్రిక్ కార్లతో ఎలన్ మాస్క్ ప్రపంచ మేటి సంపన్నుడు అయ్యాడు.అతను మిలీనియర్ నుంచి ట్రిలినియర్ గా మారబోతున్నాడు.మోర్గాన్ స్లానీ చేసిన అంచనాల ప్రకారం స్పేస్ ఎక్స్ సంస్థతో మస్క్ ట్రిలినియార్ గా ఎదగనున్నట్టు తెలుస్తోంది.

#Elon Musk #Job Amazon #Indian Embassy #Kuwait #NRI

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube