తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్

1.బిలీనియర్ కు చైనాలో జైలు శిక్ష

బిలీనియార్ , అగ్రికల్చర్ టైకూన్ సన్ దావూ కు (66 ) చైనా భారీ షాక్ ఇచ్చింది.ఆయనకు 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడం, అక్రమ మైనింగ్, వ్యవసాయ భూముల ఆక్రమణ, అక్రమ నిధుల సేకరణ, ఇలా చాలా కారణాలతో ఆ బిలినియర్ కు ఈ జైలు శిక్ష విధించింది.

 Telugu Nri America Dubai Canada News Roundup Breaking Headlines Latest Top News July 28 2021-TeluguStop.com

2.వాషింగ్టన్ డిసి వేదికగా ఆటా వేడుకలు

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( ఆటా ) 17 వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ ని 2022 జూలై 1, 2,3 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆటా కార్యవర్గం ప్రకటించింది.

3.క్రైన్ మీద నుంచి పడి టిక్ టాక్ స్టార్ మృతి

చైనాకు చెందిన 23 ఏళ్ల టిక్టక్ స్టార్ జియానో క్యుమీ భారీ క్రేన్ పై 165 ఎత్తులు వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ, కాలు జారి కింద పడిన ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

 Telugu Nri America Dubai Canada News Roundup Breaking Headlines Latest Top News July 28 2021-తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

3.కమెడియన్ ను చంపిన తాలిబన్లు

అఫ్ఘానిస్థాన్ లో ప్రధాన భూ భాగాలను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు అక్కడి ప్రజలను ఘోరంగా హింసిస్తున్నారు.తాజాగా అక్కడ ప్రముఖ హాస్య నటుడు నాజర్ మొహ్మద్ అకా ఖాసా జవాన్ ను కిడ్నాప్ చేసి చంపేశారు.

4.పాక్ లో ఇద్దరు చైనీయులపై కాల్పులు

పాకిస్తాన్ లో ఇద్దరు చైనా జాతీయుల పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో చైనీయులు తీవ్రంగా గాయపడగా వారిని కరాచీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

5.చైనా రష్యాల కు అమెరికా అధ్యక్షుడి వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ రష్యా, చైనా దేశాల కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.అమెరికాపై సైబర్ గాడికి కొన్ని దేశాలు పాల్పడుతుండటంతో బైడన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

6 జూపిటర్ మూన్ పై నీటి ఆవిరి

గురు గ్రహంపై నాసా పరిశోధనలు చేస్తోంది గురు గ్రహం తో పాటు ఆ గ్రహానికి చెందిన చందమామ గానేమీడ్ పై కొన్ని రోజులుగా పరిశోధనలు చేస్తున్నారు.దీనిలో భాగంగా గానిమీడ్ ఉపరితలంపై ఐస్ ఘనరూప నుంచి నేరుగా వాయు రూపంలో కి మారుతుందని, ఆ సమయంలో నీటి ఆవిరి ఏర్పడుతున్నట్లు హబుల్ టెలిస్కోప్ సేకరించిన డేటాను విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్నారు.

7.కరోనా పై అమెరికాలో ఆంక్షలు

అమెరికాలో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ దేశ ఆరోగ్య శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది.రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించారు.

8.భారత్ పర్యటనలపై సౌదీ హెచ్చరికలు

భారత్తో సహా దాదాపు పది దేశాలకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

9.లాక్ డౌన్ పై ఆస్ట్రేలియాలో ఆందోళనలు

ఆస్ట్రేలియాలో కరోనా ఇద్దరం వస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం రెండో దశ లాక్ డౌన్ ను విధించింది.ఈ ఆంక్షలను వ్యతిరేకిస్తూ వేలాదిమంది పౌరులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు.

10.బ్రెజిల్ లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతి రద్దు

భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా అత్యవసర అనుమతిని బ్రెజిల్ రద్దు చేసింది.

#Today NRI News #Canada #TeluguNRI #Immigrants #Indians

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు