తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -Telugu NRI America News

1.అమరావతి పాదయాత్ర లో అమెరికా ఎన్.ఆర్.ఐ లు

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు, ప్రజలు చేపట్టిన అమరావతి పాదయాత్ర లో అమెరికా ఎన్.ఆర్.ఐ లు పాల్గొన్నారు.

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర-TeluguStop.com

2.  అమెరికా తెలుగు సంబరాలు

ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలు కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సిద్ధం అవుతోంది.వచ్చే ఏడాది 26,27,28 తేదీల్లో నిర్వహించే ఈ సంబరాల కోసం నాట్స్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది.

3.ఇంగ్లాండ్ లో ఆలయంపై దాడి

Telugu Amaravati, America, Canada, Iran, Kuwait, Nri, Nri Telugu, Qatar, Russia,

పరమ శక్తి పీఠం  వాచ్చాల్య గ్రామ్ వ్యవస్థాపకురాలు సాధ్వితరంబర పర్యటన కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు చెందిన హిందూ వ్యతిరేక గ్రూప్ లు బ్రిటన్ లోని బకింగ్ హామ్ లో హిందూ ఆలయం దాడికి పాల్పడ్డాయి.

4.ఖతర్ కీలక నిర్ణయం.విజిటర్స్ కు నో ఎంట్రీ

Telugu Amaravati, America, Canada, Iran, Kuwait, Nri, Nri Telugu, Qatar, Russia,

ఫిపా వరల్డ్ కప్ -2022 కు ఆతిథ్యం ఇస్తున్న ఖతర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.నవంబర్ 1 నుంచి డిసెంబర్ 22 వరకు సందర్శకుల ఎంట్రీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

5.కువైట్ లో భారత ప్రవాసుడి అరెస్ట్

కువైట్ లో గత కొంతకాలంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న ప్రవాసులే లక్ష్యంగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తోంది.తాజాగా నిర్వహించిన తనిఖీ ల్లో ఓ ప్రవాస భారతీయిడిని అరెస్ట్ చేసినట్లు కువైట్ అధికారులు ప్రకటించారు.

6.జగన్ పై ఎన్.ఆర్.ఐ టీడీపీ కామెంట్స్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మార్చడంపై ఎన్.ఆర్.ఐ టీడీపీ అమెరికా కో ఆర్డినేటర్ జయరాం కోమటి అభ్యంత్రం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జగన్ పై విమర్శలు చేశారు.

7.ఇరాన్ లో ఇన్స్తిగ్రామ్, వాట్సాప్ బంద్

Telugu Amaravati, America, Canada, Iran, Kuwait, Nri, Nri Telugu, Qatar, Russia,

హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా ఇరాన్ లో నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.ఈ ఆందోళనల్లో మహాసా అమీనా అనే మహిళ పోలీసుల దాడిలో మరణించిన నేపథ్యంలో ఆందోళనలు మరింతగా పెరిగిపోవడం తో ఇంటర్నెట్ పై ఆంక్షలను ప్రభుత్వం విధించింది.  అలాగే వాట్సాప్, ఇన్స్తిగ్రాం లను ప్రభుత్వం బ్లాక్ చేసింది.

8.రష్యా పై మరిన్ని ఆంక్షల కు సిద్ధమైన యురోపియన్ యూనియన్

Telugu Amaravati, America, Canada, Iran, Kuwait, Nri, Nri Telugu, Qatar, Russia,

రష్యా పై మరిన్ని ఆంక్షలు విధించేందుకు యురోపియన్ యూనియన్ సిద్ధం అవుతోంది.తాజాగా జరిగిన అనధికారిక సమావేశంలో రష్యా పై మరిన్ని ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నారు.

9.ఘనంగా ముగిసిన 8 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా , న్యూజిలాండ్ తెలుగు సంఘం, తెలుగు మల్లి ఆస్ట్రేలియా , శ్రీ సాంస్కృతిక కళా సారథి సింగపూర్, మలేషియా తెలుగు సంఘం, వంశీ ఆర్ట్స్ థియేటర్స్ భారత దేశం, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక , తెలుగు తల్లి కెనడా సంస్థల సంయుక్త సంస్థల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మూడు రోజుల కార్యక్రమం ఘనంగా ముగిసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube