తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -Telugu NRI America News

1.యూరప్ పర్యటనకు ప్రధాని

Telugu America, Canada, China, Covid, Europe, Imran Khan, Nats, Nri, Nri Telugu,

యూరప్ దేశాలు అనేక సవాళ్ల తో  సతమతమవుతున్న  సమయంలో తాను డెన్మార్క్, జర్మనీ , ఫ్రాన్స్ వెళ్తున్నాం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.మే 2న ఆయన ఈ పర్యటనకు వెళ్తారు.

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర-TeluguStop.com

2.తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులకు అండగా ఎన్నారైలు

ఆస్ట్రేలియన్ కి స్వగ్రామానికి వస్తూ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రవాసులు అండగా నిలిచారు.ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన పెడ్డగమళ్ళ హెమామ్ బ్రదర్ (40) , భార్య రమాదేవి (35) ఆస్ట్రేలియా నుంచి ఏపీలో స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో సూర్యపేట జిల్లా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు.

ఈ నేపథ్యంలో వారి పిల్లలను ఆదుకునేందుకు ప్రవాసులు అండగా నిలిచారు.సుమారు 1.76 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు విరాళంగా అందించారు.

3.విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా

Telugu America, Canada, China, Covid, Europe, Imran Khan, Nats, Nri, Nri Telugu,

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లో నిఘా పెంచారు.కరోనా కేసులు తీవ్రమవుతున్న తరుణంలో జపాన్ నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు.

4.బెహరిన్ లో 38 ఏళ్ల భారతీయ మహిళ ఆత్మహత్య

బెహరిన్ లో 38 ఏళ్ల భారతీయ మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు.మృతురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

5.అనాధ ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు

Telugu America, Canada, China, Covid, Europe, Imran Khan, Nats, Nri, Nri Telugu,

అనాధ ఆకలి తీర్చేందుకు నాట్స్ మరో ముందడుగు వేసింది. టెంపాబే నాట్స్ విభాగం ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా హోమ్ చిల్డ్రన్స్ కోసం అనాధ పిల్లలు ఆకలి తీర్చడం లో తాము సైతం ముందుంటామని నాట్స్ ఈ సత్కారాన్ని చేపట్టింది.దాదాపు రెండు వేల పౌండ్లు ఆహారాన్ని ఈ సందర్భంగా నాట్ సభ్యులు సేకరించారు.

6.భారత సంతతి అధికారికి ఐదేళ్ల జైలు

Telugu America, Canada, China, Covid, Europe, Imran Khan, Nats, Nri, Nri Telugu,

విధి నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘించిన భారతీయ సంతతి అధికారికి సింగపూర్ న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.సింగపూర్ నార్కోటిక్స్ శాఖ అధికారి వెంకటేష్ రాజ్ నాయర్ నాగరాజ్ కు ఈ శిక్ష పడింది .

7.చైనా కీలక ప్రకటన భారత విద్యార్థులకు ఊరట

చైనాలో చదువుకుంటున్న భారతీయులకు చైనాను శుభ వార్త చెప్పింది భారతీయ విద్యార్థులను మళ్లీ తమ దేశంలోకి అనుమతిస్తామని తాజాగా ప్రకటించింది.

8.ఇమ్రాన్ ఖాన్ తో సహా 150 మంది పై కేసులు

Telugu America, Canada, China, Covid, Europe, Imran Khan, Nats, Nri, Nri Telugu,

మాజీ సీఎం ఇమ్రాన్ ఖాన్ తో సహా మరో 150 మంది కేసులు నమోదయ్యాయి.సౌదీ అరేబియా లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యతిరేకంగా నినాదాలు చేయడం తో ఈ కేసులు నమోదయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube