తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్- Telugu NRI America News

1.మరో ప్రముఖ అమెరికన్ సంస్థకు సీఈవో గా భారతీయుడు

అమెరికాలో ప్రముఖ కొరియర్ సంస్థ పెడెక్స్  సీఈవో గా భారతీయ అమెరికన్ సుబ్రమణ్యం నియమించబడ్డారు. 

2.అమెరికాలో టిడిపి సంబరాలు

  టీడీపీ 40 వ అవిర్భవ దినోత్సవాన్ని ఆ పార్టీ ఎన్.ఆర్.ఐ విభాగం ఆధ్వర్యంలో  సీనియర్ నాయకుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 

3.రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు

  రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంది.టర్కీ ఇస్తాంబుల్ లో జరిగిన ఇరు దేశాల చర్చల్లో ఈ మేరకు చర్చ జరిగింది. 

4.షాంఘై లో కరోనా విజృంభణ

  చైనాలోని షాంఘై లో  కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.దీంతో అనేక నగరాల్లో ఇప్పటికీ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. 

5.‘తానా ” ప్రపంచ రంగస్థల దినోత్సవం

  ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సాహిత్య విభాగం ‘ తానా ప్రపంచ సాహిత్య వేదిక ‘ ఆధ్వర్యంలో నెల నెల తెలుగు వెలుగు కార్యక్రమంలో భాగంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. 

6.భారత్ లో ఇజ్రాయిల్ ప్రధాని పర్యటన వాయిదా

  భారత్ లో ఇజ్రాయిల్ ప్రధాని నప్తాలీ బెన్నెట్ పర్యటన వాయిదా పడింది.ఏప్రిల్ 3 నుంచి 5 వరకు ఇజ్రాయిల్ ప్రధాని పర్యటన ఉన్నా, అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. 

7.పుతిన్ కి క్షమాపణలు చెప్పను : బైడన్

  రష్యా అధ్యక్షుడు పుతిన్ కసాయి అని, అతను అధికారంలో ఉండకూడదు అంటూ ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారడంతో దీనిపై తాజాగా స్పందించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అలాగే క్షమాపణలు చెప్పేది లేదని ఇది తన నైతిక ఆగ్రహం అంటూ బైడన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

8.అమెరికా లో ఘోర రోడ్డు ప్రమాదం

  అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.భారీగా పేరుకుపోయిన మంచు కారణంగా పెన్సిల్వేనియా హైవే పై దాదాపు 50 కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 

9.రష్యాకు భారత్ భారీ ఆర్డర్

  రష్యా నుంచి 45 వేల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు భారత్ ఆర్డర్ ఇచ్చింది.   

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube