తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -Telugu NRI America News

1.దక్షిణాఫ్రికాలో బాబు జన్మదిన వేడుకలు

దక్షిణాఫ్రికాలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు.

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర-TeluguStop.com

2.భారత సంతతి వ్యక్తికి ఉరి శిక్ష ఖరారు

 

Telugu Afganistan, America, Canada, Gujaratcm, Imran Khan, Kuwait, Nri, Nri Telu

మరణశిక్ష పడిన భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ కు సింగపూర్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.అతడు క్షమాభిక్ష కోసం పెట్టుకున్న దరఖాస్తును న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది.అక్రమ రవాణా చేస్తూ అతను దాంతో 2010 లో సింగపూర్ కోర్టు ఉరిశిక్ష అమలు చేసింది. 

3.కువైట్ లో రెండు వేల మంది ప్రవాసుల అరెస్ట్

  రంజాన్ మాసం ప్రారంభం అయినప్పటి నుంచి బుధవారం వరకు 2100 మంది ప్రవాసులను కువైట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.వీరిలో ఎక్కువమంది బిక్షాటన,  గ్యాంబ్లింగ్ ఇతర నేరాలకు పాల్పడినట్లు అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన రెసిడెన్సీ అఫ్ఫైర్స్ అండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ విభాగం వెల్లడించింది. 

4.మరియు పోల్ కు విముక్తి కల్పించాం : పుతిన్

 

Telugu Afganistan, America, Canada, Gujaratcm, Imran Khan, Kuwait, Nri, Nri Telu

ఉక్రెయిన్ లోని మరియు నగరానికి విజయవంతంగా విముక్తి కల్పించామని రష్యా అధ్యక్షుడు వాధ్లిమర్ పుతిన్ ప్రకటించారు. 

5.భారత్ లో బుల్ డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని

  రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇండియా వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉత్సాహంగా గడుపుతున్నారు.గుజరాత్ ముఖ్యమంత్రి భూపిందర్ పటేల్ తో కలిసి గురువారం ఆయన రాష్ట్రంలో పర్యటించారు.అక్కడ హోలోల్ లో కొత్తగా ప్రారంభమైన ఒక జెసిబి ఫ్యాక్టరిని ఆయన సందర్శించి కొద్దిసేపు బుల్డోజర్ ఎక్కి ఆపరేట్ చేశారు. 

6.ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు పేలుళ్ళు .18 మంది మృతి

 

Telugu Afganistan, America, Canada, Gujaratcm, Imran Khan, Kuwait, Nri, Nri Telu

ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి బాంబుల మోత మోగింది.వరుస పేలుళ్లు చోటు చేసుకోవడంతో 18 మంది మృతి చెందగా , 65 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. 

7.ఆస్ట్రేలియా ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

  అంగవైకల్యంతో జన్మించిన చిన్నారులపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీ సన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అంగవైకల్యం లేని పిల్లలు పుట్టడం తనకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటూ ఆయన వ్యాఖ్యానించారు.కాగా ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. 

8.ఇమ్రాన్ ఖాన్ కు ప్రాణహాని .పాక్ ప్రధాని కీలక ఆదేశాలు

 

Telugu Afganistan, America, Canada, Gujaratcm, Imran Khan, Kuwait, Nri, Nri Telu

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బెదిరింపులు వ్యవహారం చర్చగా మారింది.తమ నేత ఇమ్రాన్ ఖాన్ కు ప్రాణహాని ఉందని ఆ పార్టీ నేతలు పేర్కొనడంతో పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది.ఇమ్రాన్ ఖాన్కు పూర్తి భద్రత కల్పించాలని ప్రధాని శేహాబాజ్ షరీఫ్ ను ఆదేశించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube