తెలుగు ఎన్. ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.బుర్జ్ ఖలీఫా వద్ద భారతీయుల సంబరాలు

Telugu America, Booster Dose, Burj Khalifa, Calinia, Canada, Delta, France Israe

టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు సంచలనమైన ఆటతీరుతో కాంస్య పతకం సాధించింది.జర్మనీపై 5- 4 తేడాతో భారత్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.ఈ  విజయాన్ని యూఏఈ లోని కొంత మంది ప్రవాస భారతీయులు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా వద్ద సెలబ్రేట్ చేసుకున్నారు.
 

2.అమెరికాలో 50 శాతం వాక్సినేషన్ పూర్తి

  అమెరికా జనాభాలో 50 శాతం మంది ప్రజలు పూర్తి స్థాయిలో కోవిడ్ టీకా తీసుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది.
 

3.ఆఫ్గాన్ లో 385 మంది తాలిబన్ ఉగ్రవాదులు మృతి

Telugu America, Booster Dose, Burj Khalifa, Calinia, Canada, Delta, France Israe

  ఆఫ్ఘనిస్థాన్లో 385 మంది తాలిబన్ ఉగ్రవాదులు మృతిచెందారు.భద్రత దళాలు నిర్వహించిన ఆపరేషన్ లో 385 మంది మృతి చెందగా, 210 మంది గాయపడ్డారని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
 

4.నాసా ప్రయత్నం విఫలం

  నాసా ప్రయోగించిన రోవర్ పర్సెవర్సన్ ఇప్పటికే మార్స్ పై పరిశోధనలు చేస్తోంది.మార్స్ మీద ఉన్న వాతావరణానికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు తీసి భూమి మీదకి పంపుతోంది.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians , Califor-TeluguStop.com

అయితే నాసా పంపిన రోవర్ రాళ్లను డ్రిల్ చేసి వాటి నమూనాలను భూమిమీదకు పంపాల్సి ఉన్న ఆ ప్రయత్నంలో రోవర్  విఫలమైంది.ఇవన్నీ సర్వసాధారణమేనని నాసా రోవర్ మిషన్ డైరెక్టర్ పేర్కొన్నారు.
 

5.కరోనా లో కొత్త వేరియంట్

Telugu America, Booster Dose, Burj Khalifa, Calinia, Canada, Delta, France Israe

  కరోనా వైరస్ కొత్త రూపాలు ఆందోళన పెంచుతున్నాయి.ఇప్పటికే డెల్టా వేరియంట్ తో ప్రపంచం వణికి పోతూ ఉండగా, కొత్తగా ల్యా మ్డ, ఈటా వంటి వైరస్ లు పుట్టు కొచ్చాయి ఇవి మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
 

6.ఒక్క రోజులో ఏడు లక్షలకు పైగా కేసులు

  ప్రపంచ వ్యాప్తంగా గురువారం ఒక్కరోజులోనే ఏడు లక్షల కేసులు నమోదయ్యాయి.
 

7.కొవ్వు కరిగించే మందు తో కరోనా కట్టడి

Telugu America, Booster Dose, Burj Khalifa, Calinia, Canada, Delta, France Israe

  కొవ్వు తగ్గించేందుకు వాడే ఫినో ఫైబ్రెట్ ఔషదం కోవిడ్ – 19 వైరస్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తున్నట్లు పరిశోధనలో తేలింది.యూకేలోని బర్మింగ్ హోమ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది.
 

8.గురుద్వారా లో ఉద్రిక్తత ఖండించిన భారత్

  తూర్పు ఆఫ్ఘనిస్థాన్ లోని  పవిత్ర గురుద్వారా తాల్ సాహిబ్ పై కప్పుపై ఉన్న సిక్కుల జెండా అయిన నిషాన్ సాహిబ్ ని తాలిబన్లు తొలగించారు.అయితే మిషన్ సాహెబ్ ను తొలగించిన విధానాన్ని భారత్ ఖండించింది.
 

9.బూస్టర్ డోస్ పై వెనక్కి తగ్గని ఆ దేశాలు

  తమ దేశ ప్రజలకు బూస్టర్ డోస్ వేసేందుకు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ ఇజ్రాయేల్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు 3 డోస్ విషయంలో తొందరపడవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా, ఈ దేశాలు మాత్రం తమ దేశ ప్రజలకు మూడో డోసు వేసేందుకే మొగ్గు చూపుతున్నాయి.
 

10.కాలిఫోర్నియాలో కార్చిచ్చు

Telugu America, Booster Dose, Burj Khalifa, Calinia, Canada, Delta, France Israe

  కాలిఫోర్నియా అడవుల్లో రగిలిన కార్చిచ్చు దా వనంలో వ్యాపిస్తోంది.ఉత్తర కాలిఫోర్నియాలోని మౌంటెన్ పట్టణాన్ని కార్చిచ్చు చుట్టుముట్టడంతో వేలాదిమంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి పోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube