తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.న్యూయార్క్ గవర్నర్ రాజీనామాకు డిమాండ్

Telugu Aman Nag Sen, Andrew Cuomo, Canada, Governor York, Indian, Nri, Nri Telug

  న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో పది మందికి పైగా మహిళలు లైంగిక వేధింపులకు గురి చేశారని న్యూయార్క్ అటార్నీ జనరల్ లేతితియ జేమ్స్ సంచలన విషయాలు వెల్లడించారు.దీంతో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతోంది.
 

2.ఇజ్రాయిల్ పై రాకెట్ల దాడి

  ఇజ్రాయిల్ పై రాకెట్ల దాడులు జరిగాయి.బుధవారం మధ్యాహ్నం తమ దేశంపై దాడి లో భాగంగా మూడు రాకెట్లను లెబనాన్ ప్రయోగించినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది.
 

3.ఇండోనేషియాలో లక్ష దాటిన కరోనా మరణాలు

Telugu Aman Nag Sen, Andrew Cuomo, Canada, Governor York, Indian, Nri, Nri Telug

  గడిచిన 24 గంటల్లో ఇండోనేషియాలో 1,747 కరోనా మరణాలు నమోదు అయ్యాయి.దీంతో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్ష మార్క్ ను దాటింది.
 

4.ఆర్థిక ఇబ్బందుల్లో పాక్ .అద్దెకు ప్రధాని నివాసం

  పాకిస్తాన్ ఆర్థికంగా దిగజారిపోతోంది.ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది దీంతో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ ప్రభుత్వం ఇస్లామాబాద్లో ప్రధానమంత్రి భవనాన్ని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
 

5.గల్ఫ్ కార్మికులకు అన్యాయం

  ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గల్ఫ్ కార్మికుల ఇబ్బందులు ఇంకా తీరలేదు.వేతనాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన కొత్త సర్కులర్ ఇంకా అందకపోవడంతో వలస జీవులు ఇంకా శ్రమదోపిడికి గురవుతున్నారు.
 

6.చైనాలో పందుల కోసం 13 అంతస్థుల భవనం

Telugu Aman Nag Sen, Andrew Cuomo, Canada, Governor York, Indian, Nri, Nri Telug

  చైనా ఏది చేసినా సరికొత్తగానే ఉంటుంది.పందుల కోసం హై సెక్యూర్డ్ భారీ భవనాల్లో కెమెరాల పహారా లో పందులను పెంచుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 

7.భారత్ సహా ఐదు దేశాలపై నిషేదం ఎత్తివేత

  భారత్తో పాటు ఐదు దేశాల ప్రయాణికుల ప్రవేశం పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు యూఏఈ నేషనల్ ఎమర్జెన్సీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ (NCEMA) తెలిపింది.
 

8.ప్రవాసీయుల దాతృత్వం

  ఫ్రాన్స్ లో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు తమ గొప్ప మనసు చాటుకున్నారు.ఇండియా లోని 13 వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు, ఎన్జీవోలకు వైద్య పరికరాలను విరాళంగా అందజేశారు.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indian Student,-TeluguStop.com

GOPIO FRANCE METROPOLE అనే ప్రవాస భారతీయులకు చెందిన ప్రపంచ స్థాయి సంస్థ ఫ్రాన్స్లోని ఇండియన్ కమ్యూనిటీ సభ్యులతో కలిసి వివరాలు సేకరించింది.వీటితోనే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, తదితర వైద్య పరికరాలను భారత్ కు తరలించింది.
 

9.ఎన్నారై ఫౌండేషన్ ఆర్థిక సాయం

Telugu Aman Nag Sen, Andrew Cuomo, Canada, Governor York, Indian, Nri, Nri Telug

  రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కలికిరి సైనిక్ స్కూల్ నిర్వహించిన ప్రవేశ పరీక్షలలో ఎంపికైన విద్యార్థి నాగదేవి మొదటి సంవత్సరం ఫీజు నిమిత్తం కర్నూలు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సహాయం అందించింది.బుధవారం కర్నూలు ఎస్పి సుధీర్ కుమార్ రెడ్డి ద్వారా విద్యార్థి జయ సాయి నాగ దేవ్ కు చెక్కును అందజేశారు.
 

10.చైనా లో హత్యకు గురైన భారతీయ విద్యార్థి.వ్యక్తి అరెస్ట్

Telugu Aman Nag Sen, Andrew Cuomo, Canada, Governor York, Indian, Nri, Nri Telug

  భారత్ కు చెందిన విద్యార్థి చైనా లో తన హాస్టల్ గదిలో శవమై కనిపించిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే అయితే ఆ విద్యార్థిని హత్య చేసినట్లు భావిస్తున్న పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.మృతుడు అమన్ నాగ్ సేన్ (20) బీహార్ లోని గయ కు చెందినవాడు.

   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube