తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.యూరోప్ దేశాలకు వెళ్లే తెలుగు వారి కోసం హ్యాండ్ బుక్

  ఉద్యోగాల కోసం యురోపియన్ యూనియన్ లోని దేశాలకు వెళ్లే తెలుగు వారి కోసం ఈయూ – ఇండియా సంయుక్తంగా రూపొందించిన హ్యాండ్ బుక్ ను రాష్ట్ర కార్మిక శాఖ , నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సంయుక్తంగా ఆన్లైన్ లో విడుదల చేశాయి.
 

2.జర్మనీ కీలక నిర్ణయం

 

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�-TeluguStop.com

వ్యక్తిగత నైపుణ్యాలు ఉన్న నాలుగు లక్షల మంది విదేశీయులను దేశంలోకి ఆహ్వానించేందుకు జర్మనీ నిర్ణయించింది.
 

3.వలసదారుల కు సౌదీ అరేబియా శుభవార్త

 

వలసదారుల కు సౌదీ అరేబియా శుభవార్త చెప్పింది.ప్రవాసుల రెసిడెన్సీ వీసా గడువు ని పొడిగించింది.జనవరి 31 తో ముగుస్తున్న గడువు ని మరో పది రోజులు పొడిగించింది. 

4.భారత పర్యటనలో చైనా పై జర్మనీ అధికారి విమర్శలు

  భారత్ జర్మనీల మధ్య నావికాదళ పరస్పర సహకారాలను మరింత బలపరిచేందుకు న్యూ ఢిల్లీ కి చేరుకున్న జర్మన్ నేవీ చీఫ్ కే – అచీమ్ షాన్ బాచ్ చైనా పై విమర్శలు చేశారు.అంతర్జాతీయంగా చైనా ఎన్నో తప్పులు చేస్తోందని ఆయన మండిపడ్డారు. 

5.భారత్ నుంచి పాక్ మీదుగా ఆఫ్ఘన్ కు గోధుమలు

 

తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న ఆఫ్ఘన్ ప్రజలను ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది.దీనిలో భాగంగానే 50 వేల టన్నుల గోధుమలను, కరోనా వాక్సిన్ లతో పాటు ఇతర సహాయాలు భారత్ నుంచి పాకిస్థాన్ మీదుగా ఆఫ్ఘన్ చెరనున్నాయి.తమ దేశం గుండా తీసుకువెళ్లేందుకు పాక్ సైతం అంగీకరించింది. 

6.భారతీయుల మృతిపై కెనడా ప్రధాని ఆవేదన

  కెనడా అమెరికా సరిహద్దు ప్రాంతంలోని తీవ్రమైన గడ్డకట్టే చలి కారణంగా శిశువు తో సహా నలుగురు మృతి చెందడం మనసుని కలచివేసే విషాదంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో పేర్కొన్నారు. 

7.చైనా కు 44 ప్యాసింజర్ విమానాలు రద్దు చేసిన అమెరికా

 

చైనా కు అమెరికా 44 విమాన సర్వీసులను రద్దు చేసింది.అమెరికా కు చైనా సర్వీసులను నిలిపివేసిన నేపథ్యంలో అమెరికా ఈ చర్యలకు దిగింది. 

8.విదేశీ ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్

 

భారత్ కు వచ్చే విదేశీ ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.విదేశీ టూరిస్ట్ ల ఐసోలేషన్ లో మార్పులు చేసింది.గతంలో ఉన్న నిబంధనలు సవరించింది.కొత్త నిబంధనలు జనవరి 22 నుంచి అమల్లోకి వస్తాయి. 

9.కరోనా పై ఐ హెచ్ ఎం ఈ అధ్యయనంలో సంచలన విషయాలు

  కరోనా వైరస్ అంత్య సంబంధమైన వ్యాధిగా మారే దిశగా పయనిస్తోందని అమెరికా ఫిజిషియన్ క్రిస్టోఫర్ ముర్రే అన్నారు.       

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube