తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

 

1.ఖతర్ లో ఘనంగా సంక్రాంతి

 

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�-TeluguStop.com

 సంక్రాంతి పండుగను కథకు దేశంలోని ప్రవాసీలు ఘనంగా జరుపుకున్నారు.ఆంధ్ర కళా వేదిక నిర్వహణ కమిటీ నేతృత్వంలో వెంకప్ప భాగవతుల ‘అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి.
   

2.అమెరికాలో 1200 విమానాలు రద్దు

 

అమెరికాలో ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోయాయి చలి తుఫాన్ కారణంగా అమెరికా ఆగ్నేయ ప్రాంతంలోని పలు రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.దీంతో ఉత్తర కెరొలిన లోని షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించాల్సిన 1200 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు.
 

3.యూఏఈ నుంచి ముంబై వచ్చే వారికి ఊరట

 యూఏఈ నుంచి ముంబై వచ్చే ప్రయాణికులకు ఊరట లభించింది.యూఏఈ, దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఇకపై పీసీఆర్ టెస్ట్ ఉండదు.అలాగే ఏడు రోజుల తప్పనిసరి హోమ్ క్వారంటైన్ నిబంధనను కూడా తొలగించారు.
 

4.కెనడా పై చైనా విమర్శలు

  కరోనా వైరస్ కు  మూల కారణం అయిన చైనా ఇప్పుడు తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ఒమిక్రాన్ కేసులు కూడా ఇక్కడ పెరుగుతూ ఉండడంతో , ఈ కేసులు పెరగడానికి కెనడా నుంచి వచ్చే పార్సిల్స్  కారణం అని ఆరోపణలు చేస్తోంది.
 

5.ఉక్రెయిన్ కు మిస్సైల్స్ పంపిన బ్రిటన్

 ఉక్రెయిన్ -రష్యా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి నేపథ్యంలో ఉక్రెయిన్ కు అండగా నాటో దళాలు నిలిచాయి.ఉక్రెయిన్ కు సాయం చేసేందుకు బ్రిటన్ సిద్ధమైంది.ఈ మేరకు తమ వద్ద ఉన్న స్వల్ప శ్రేణి యాంటీ ట్యాంక్ క్షిపణులను ఉక్రెయిన్ కు బ్రిటన్ పంపింది.
 

6.ఆఫ్ఘనిస్తాన్ లో  భూకంపం 26 మంది మృతి

  పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది.ఏ ఘటనలో దాదాపు 25 మంది వరకు మృతి చెందారని అధికారులు తెలిపారు.
 

7.డ్రోన్ దాడి పై యూఏఈ స్పందన

 అబుధబి ఎయిర్ పోర్ట్ దాడి ఘటనపై ప్రభుత్వం స్పందించింది.సాటి మనుషుల ప్రాణాలు తీయడం పాపం.ఇలాంటి పాపపు పని చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేర అంటూ యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్ బిన్ జయేద్ ఆల్ నహ్యాన్ అన్నారు.
 

8.జపాన్ లో కరోనా విజృంభణ

 

జపాన్ లోని అనేక ప్రాంతాల్లో కరోనా తీవ్రం అవుతోంది.ఒకాసా లో అత్యధిక స్థాయిలో మంగళవారం దాదాపు 6 వేల కేసులు నమోదయ్యాయి.
 

9.కరోనా తో  కొత్తగా 16 వేల మంది నిరుపేదలు

  కరోనా మహమ్మారి విజృంభించిన రెండేళ్ల కాలంలో మరో 16 కోట్ల మందికి పైగా దుర్భర దారిద్ర్యంలో కి కూరుకుపోయారని పేదరిక నిర్మూలన కోసం పాటుపడే స్వచ్ఛంద సంస్థ ఆక్స్ఫామ్ అధ్యయనంలో వెల్లడైంది.           

.

Telugu NRI News Roundup NRI News In Telugu Latest NRI News, Today NRI News America, Britain, Earth Quick , Ukraine, Missails, COVID 19, Drone Bomb Blast, China, Canada Parsela, Qatar Sankranti, Indian Traditional Festival - Telugu America, Britain, Canada Parsela, China, Covid, Drone Bomb, Earth, Missails, Qatar Sankranti, Ukraine

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube