తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ 

1.ఆఫ్గాన్ పరిస్థితిపై భారత్ అధ్యక్షతన ఐక్యరాజ్యసమితి సమావేశం

  ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్ లు తమ ఆధీనంలో కి తీసుకున్న క్రమంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది .ఈ రోజు భారత్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరగనుంది.
 

2.కాబూల్ ఎయిర్ పోర్ట్ లో కాల్పులు ఐదుగురి మృతి

Telugu America, Bandi Yanaswami, Biden, Canada, Nri, Nri Telugu, Tana, Telugu Nr

  ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ఎయిర్ పోర్ట్ లో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మృతి చెందారు.
 

3.తాలిబాన్లతో స్నేహానికి సిద్ధమైన చైనా

  ఆఫ్ఘనిస్తాన్ తో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచు కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
 

4.తానా నవలల పోటీ .వీరే విజేతలు

Telugu America, Bandi Yanaswami, Biden, Canada, Nri, Nri Telugu, Tana, Telugu Nr

  తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ( తానా) నిర్వహించిన నవలల పోటీలు విశాఖపట్నానికి చెందిన చింతకింది శ్రీనివాసరావు రాసిన మున్నీ టి గీతలు, అనంతపురానికి చెందిన బండి నారాయణ స్వామి రాసిన అర్ధనారీ నవలలు బహుమతులు గెలుచుకున్నాయి.
 

5.బైడన్ రాజీనామా కు డిమాండ్

Telugu America, Bandi Yanaswami, Biden, Canada, Nri, Nri Telugu, Tana, Telugu Nr

  ఆఫ్గనిస్తాన్ లో చోటు చేసుకున్న పరిస్థితులకు పూర్తిగా అమెరికా అధ్యక్షుడు జో బైడన్ బాధ్యత వహించాలని, వెంటనే ఆయన రాజీనామా చేయాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు.
 

6.కాబుల్ ఎయిర్ పోర్ట్ ను అధీనంలోకి తీసుకున్న అమెరికా

  కాబూల్ విమానాశ్రయం వద్ద పెద్ద ఎత్తున జనాలు గుమిగూడడం, గందరగోళ  పరిస్థితి తలెత్తడం తదితర కారణాలతో కాబూల్ ఎయిర్ పోర్ట్ ను  అమెరికా భద్రతా దళాలు తమ ఆధీనంలో కి తీసుకున్నాయి.
 

7.ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ స్పందన

  ఆఫ్గాన్ లో జరిగిన పరిణామాలను బానిస సంకెళ్లను తెంచుకొని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభివర్ణించారు.
 

8.మహాత్ముడి కి ఒహియో సెనేటర్ ఘన నివాళి

Telugu America, Bandi Yanaswami, Biden, Canada, Nri, Nri Telugu, Tana, Telugu Nr

  ఒహియో రాష్ట్ర సెనేటర్ నీరజ్ అంటానీ డల్లాస్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను కొనియాడారు.
 

9.ఇండో యూఎస్ సంబంధాలు మెరుగు

  భారత్ అమెరికా మధ్య సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని అమెరికాలో భారత రాయబారి రంజిత్ సింగ్ సంధు వ్యాఖ్యానించారు.
 

10.ఆఫ్గాన్ పరిస్థితులపై బాలీవుడ్ హీరోయిన్ స్పందన

Telugu America, Bandi Yanaswami, Biden, Canada, Nri, Nri Telugu, Tana, Telugu Nr

  ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న సంక్షోభం పై బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఆ దేశ పౌరులు, మహిళల స్థితి పై ఆమె కలత చెందారు.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Tana, America, Bi-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube