1.భారత ప్రజలకు బైడన్ శుభాకాంక్షలు

భారత ప్రధాన అమెరికా అధ్యక్షుడు జో బైడన్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
2.సింగపూర్ లో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
భారత 75 స్వాతంత్ర దినోత్సవం ను పురస్కరించుకుని సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న శ్రీ ‘ సాంస్కృతిక కళా సారథి ‘ అధ్వర్యంలో ‘ జయ ప్రియ భారత జనయిత్రీ ‘ అనే కార్యక్రమం ఘనంగా జరిగింది.
3.పిల్లలపై ‘ డెల్టా ‘ ప్రభావం

అమెరికా లో ‘ డెల్టా ‘ వైరస్ ప్రభావం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఈ వైరస్ కారణం గా ఇప్పటి వరకు 1902 మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరారు.
4.అబుదబి కొత్త నిబంధనలు
యూఏఈ రాజధాని అబుదాబి అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.ఆగస్టు 15 నుంచి విదేశాల నుంచి అబుదాబి కి వచ్చే యూఏయి పౌరులు, నివాసితులు, తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలి అని, పిసియార్ పరీక్ష చేయించుకోవాలి అనే నిబంధనలు విధించింది.
5.బైడన్ పై ట్రంప్ విమర్శలు
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పై మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
6.రాజీనామా చేయనున్న మలేషియా ప్రధాని

మలేషియా ప్రధానమంత్రి ముహిద్దిన్ యాసిన్ రేపు ( సోమవారం ) రాజీనామా చేయనున్నారు.
7.కరేబియన్ దీవిలో భూకంపం

కరేబియన్ దీవుల్లోని హైతీ లో భారీ భూకంపం సంభవించింది.ఈ ఘటనలో మొత్తం 304 మంది చనిపోగా, 1800 మంది గాయపడ్డారు.
8.ఆఫ్ఘన్ నూతన అధ్యక్షుడిగా అబ్దుల్ ఘని
ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా ఆశ్రఫ్ ఘని నూతన అధ్యక్షుడిగా తాలిబాన్ కమాండర్ ముల్లా అబ్దుల్ ఘని బారదార్ బాధ్యత తీసుకోనున్నారు.
9.అమెరికా లో పెరుగుతున్న ఆసియన్ జనాభా
అమెరికాలో అశియన్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది.2020 నాటికే ఆసియన్ అమెరికన్ల సంఖ్య 2.4 కోట్లకు చేరుకుంది.
10.ఆఫ్ఘన్ పై తాలిబన్ల ఆధిపత్యం

ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి తాలిబన్ల వశం అయ్యింది.ఇప్పటికే కాబూల్ మినహా మిగిలిన ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.