తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ రౌండప్

1.కేసీఆర్ కు చెప్పిన టిఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ టీమ్

Telugu Canada, Algeria, Indians, Israel, Marburg, Africa, Nri, Nri Telugu, Telug

హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టిఆర్ఎస్ ప్రస్తుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను కేసీఆర్ ఖరారు చేసిన నేపథ్యంలో టిఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ దుసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
 

2.అమెరికాలో పిల్లల పై డెల్టా పంజా

  అమెరికాలో డెల్టా వేరియంట్ వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians , North A-TeluguStop.com

ముఖ్యంగా పిల్లలపై ఈ డెల్టా వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.చాలా ప్రాంతాల్లో ఆస్పత్రులలో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.
 

3.దుబాయ్ లాటరీ లో ఇద్దరు భారతీయుల జాక్ పాట్

Telugu Canada, Algeria, Indians, Israel, Marburg, Africa, Nri, Nri Telugu, Telug

  దుబాయ్ మహా జూజ్ వీక్లీ డ్రాలో ఇద్దరు భారతీయులు జాక్ పాట్ కొట్టారు.కేరళ కు చెందిన దీప, పాండిచ్చేరి కి చెందిన బరనిధరన్ ఇద్దరూ చెరో మిలియన్ దిరంహమ్స్ (2 కోట్ల 2 లక్షలు ) గెలుచుకున్నారు.
 

4.యూఏయి ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎవరు ప్రెస్ కీలక సూచన

   యూఏఈ వెళ్లే ప్రయాణికులకు ఇండియన్ బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కీలక సూచన చేసింది.ప్రయాణికులు తాము వెళ్లాల్సిన విమాన ప్రయాణానికి ఆరు గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలని కోరింది.
 

5.1.2 ట్రిలియన్ డాలర్ల బిల్లుకు అమెరికా సెనైట్ ఆమోదం

Telugu Canada, Algeria, Indians, Israel, Marburg, Africa, Nri, Nri Telugu, Telug

  కరుణతో దెబ్బతిన్న దేశాన్ని మళ్లీ నిలబెట్టేందుకు తయారుచేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూఎస్ సెనేట్ ఆమోదం తెలిపింది.1.2 ట్రిలియన్ డాలర్ల ఈ బిల్లును సేనేట్ సభ్యులు 69 – 30 ఓట్ల తేడా తో గెలిపించారు.
 

6.ఇజ్రాయిల్ పై చైనా సైబర్ దాడి

  ఇజ్రాయిల్ పై చైనా హ్యాకర్లు భారీ సైబర్ దాడికి పాల్పడ్డారు.ఆ దేశానికి  చెందిన వివిధ ప్రభుత్వ సంస్థలు, ఐటీ, టెలికాం కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నారు.ఈ దాడి చైనాకు చెందిన హ్యాకర్లు జరిపినట్లు అమెరికాలోని కాలిఫోర్నియా సెక్యూరిటీ కంపెనీ ఫస్ట్ ఐ వెల్లడించింది.
 

7.నలుగురికి సోకిన కొత్త వైరస్

  కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొస్తూ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నాయి.తాజాగా మార్ బర్గ్ వ్యాధి విజృంభిస్తోంది.

పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో ఆగస్ట్ 2 న చనిపోయిన వ్యక్తిలో ఈ వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి.ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
 

8.ఆఫ్ఘాన్ లో భయం భయం .ఇండియా కు వచ్చిన 50 మంది

  ఆఫ్ఘనిస్తాన్ లో రోజు రోజుకు పరిస్థితి దిగజారుతోంది.దీంతో అఫ్ఘాన్ లో ఉన్న భారతీయులను సురక్షితంగా భారత ప్రభుత్వం ప్రత్యేక విమానం ద్వారా 50 మంది భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చారు.
 

9.కెనడా వ్యాపారవేత్త కు చైనా జైలు

Telugu Canada, Algeria, Indians, Israel, Marburg, Africa, Nri, Nri Telugu, Telug

  కెనడా కు చెందిన వ్యాపారవేత్త మైకేల్ స్పావర్ కు 11 ఏళ్ల జైలు శిక్షను చైనా విధించింది.గుడచర్యం ఆరోపణల తో ఈయన్ని అరెస్ట్ చేశారు.
 

10.అల్జీరియా అడవుల్లో అగ్నికీలలు.42 మంది మృతి

Telugu Canada, Algeria, Indians, Israel, Marburg, Africa, Nri, Nri Telugu, Telug

  ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియా అడవుల్లో మంటలు చెలరేగాయి.మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన 25 మంది సైనికుల తో పాటు, మొత్తం 42 మంది మరణించారు.       

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube