తెలుగు ఎన్. ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్స్.కువైట్ సంచలనం

Telugu Canada, Indians, Japan, Kim Yoo Jung, Latest Nri, Nerali Patel, Nicolas S

  వలసదారులకు డ్రైవింగ్ లైసెన్సులు జారీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకోబోతోంది.ఇక పై ప్రవసులకు డ్రైవింగ్ లైసెన్స్ లు జారీ ని పరిమితం చేయడానికి అంతర్గత మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైజల్ నవాఫ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

2.‘తానా ‘ వారి ‘ గ్రంథాలయం ‘

   తానా ( తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ) క్యాపిటల్ రీజియన్ మరో ముందడుగు వేసింది తెలుగు సాహిత్యాన్ని పెంపొందించడం కోసం తన గ్రంథాలయం ఏర్పాటు చేసి దాన్ని తెలుగుభాష పరిరక్షణ తీర్చిదిద్దాలని భావిస్తోంది. 

3.చైనా పై భారత్ మండిపాటు

Telugu Canada, Indians, Japan, Kim Yoo Jung, Latest Nri, Nerali Patel, Nicolas S

  భారత్ వాస్తవాధీన రేఖను దాటి వచ్చి తమ భూభాగాన్ని ఆక్రమిస్తూ ఉందంటూ చైనా చేసిన ఆరోపణలపై ఇండియా స్పందించింది.చైనా కవ్వింపు చర్యలు, ఏకపక్ష నిర్ణయాల వల్లే సరిహద్దుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని భారత్ స్పష్టం చేసింది. 

4.కోవీ షీల్డ్ టీకాకు ఆస్ట్రేలియా అనుమతి

  ఆస్ట్రేలియా ప్రభుత్వం కోవీ షీల్డ్ టీకాకు అనుమతి ఇచ్చింది.కోవీ షీల్డ్ టీకా వేసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులకు దేశంలో ఎటువంటి ఆటంకాలు ఉండవని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. 

5.ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి ఏడాది జైలు

Telugu Canada, Indians, Japan, Kim Yoo Jung, Latest Nri, Nerali Patel, Nicolas S

  ఫ్రాన్స్ ఎన్నికల సమయంలో అక్రమంగా నిధులు సేకరించారు అన్న కేసులో మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ (66) కి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ప్యారిస్ లోని ఓ కోర్టు తీర్పు వెల్లడించింది. 

6.భారతీయ మహిళ పై లండన్ లో దాడి

   ఉత్తర లండన్ లోని హవర్ స్టాక్ హిల్ లో పెట్రోల్ పంప్ నడుపుతున్న భారతీయ మహిళ నేరాలీ పటేల్ ( 38) ను పెట్రోల్ లేదని చెప్పినందుకు కొంతమంది వ్యక్తులు దాడికి దిగిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

7.ఎన్.ఆర్.ఐ లకు పేటియం శుభవార్త

Telugu Canada, Indians, Japan, Kim Yoo Jung, Latest Nri, Nerali Patel, Nicolas S

  ఎన్నారైల కోసం పేటీఎం సంస్థ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది దీనిద్వారా ఎన్.ఆర్.ఐ లు ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే ,నేరుగా తన బంధువులు, స్నేహితుల పేటీఎం డిజిటల్ వాలెట్ లోకి నిధులు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.దీనికోసం పేటీఎం రియా మని ట్రాన్స్ఫర్ అనే నగదు బదిలీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 

8.జపాన్ యువ రాణి పెళ్లి ముహూర్తం ఫిక్స్

  జపాన్ యువ రాణి మాకో తన చిరకాల ప్రేమికుడు కీయ్ కౌమురో ను పెళ్లి చేసుకోబోతోంది.అక్టోబర్ 26 న ఆమె వివాహం జరగనుంది. 

9.అధికారులకు పాకిస్థాన్ కొత్త రూల్

  పాకిస్తాన్ లో అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు సీనియర్ ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్ రింగ్ టోన్ లను ‘ పాకిస్థాన్ జిందాబాద్ ‘ ట్రాక్ కి సెట్ చేయాలని బలూచిస్తాన్ ప్రావీన్స్ ప్రభుత్వం ఆదేశించింది. 

10.కిమ్ సోదరికి కీలక పదవి

Telugu Canada, Indians, Japan, Kim Yoo Jung, Latest Nri, Nerali Patel, Nicolas S

  ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సోదరి కిమ్ యో జంగ్ కు నార్త్ కొరియా స్టేట్ ఎఫైర్స్ కమిటీలో కీలక పదవిని అప్పగించారు.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians, Us, Immi-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube