తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ రౌండప్

1.విమానాశ్రయం పై దాడులు

  ఆఫ్ఘన్ లో తాలిబన్లు తమ విధ్వంసకాండ కొనసాగిస్తున్నారు.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians, Us, Immi-TeluguStop.com

దేశ దక్షిణ ప్రాంతంలో కీలకమైన కాందహార్ ఆక్రమణకు గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.దీనిలో భాగంగానే పెద్దఎత్తున మిలిటెంట్లు నగరంలోకి ప్రవేశించి విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.రాకెట్ల దాడులతో విమానాశ్రయ రన్ వే దెబ్బతింది.
 

2.యూఎన్ భద్రత మండలి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భారత్

Telugu Canada, Delta, Indians, Latest Nri, Nri, Nri Telugu, Pegases, Telugu Nri,

  ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను ఆగస్టు నెలకు గాను భారత్ కు అప్పగించారు.ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబార తిరుమూర్తి ఆదివారం UNSC అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.
 

3.‘పెగాసెస్ ‘ బ్లాక్

  ప్రపంచవ్యాప్తంగా తాము తయారుచేసిన పెగాసస్ స్పై వేర్ దుర్వినియోగంఅవుతోందని అనేక కథనాలు వెలువడి , అనేక దేశాల్లో వివాదం అయిన నేపథ్యంలో దాని తయారీ సంస్థ ఎన్ ఎస్  ఓ గ్రూప్ తమ సొంత క్లయింట్లు ఆ స్పైవేర్ ఉపయోగించడానికి వీలు లేకుండా చేసిందని అమెరికా మీడియా పేర్కొంది.
 

4.ప్రమాదానికి గురైన భారత ప్రవాసుడు.6 కోట్లు చెల్లించమన్న దుబాయ్ కోర్ట్

  రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారత ప్రవాసుడు కేరళకు చెందిన సిజీష్ పనట్టు సుబ్రమణ్యం (41) కు పరిహారంగా రూ.6.20 కోట్లు చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీ కి దుబాయ్ కోర్టు ఆదేశించింది.
 

5.అమెరికాలో భారతీయుడికి జైలు

Telugu Canada, Delta, Indians, Latest Nri, Nri, Nri Telugu, Pegases, Telugu Nri,

  అమెరికాలో మనీలాండరింగ్ కు పాల్పడిన ప్రవాస భారతీయుడు లవ్ ప్రీత్ సింగ్ అనే భారత వ్యక్తికి 15 నెలల జైలు శిక్ష తో పాటు, రూ.3.50 లక్షల జరిమానా విధించారు.
 

6.అమెరికాకు మరిన్ని ఎయిరిండియా సర్వీసులు

  కరుణ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న విమాన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.మొన్నటి వరకు అనేక అంతర్జాతీయ సర్వీసులు పై నిషేదం ఉండగా , తాజాగా సడలింపులు ఇవ్వడంతో ఎయిర్ ఇండియా అమెరికా కు విమాన సర్వీసులను పెంచుతున్నట్లు ప్రకటించింది ఆగస్టు 7 నుంచి వారానికి 21 విమానాలు నడుపుతామని తెలిపింది.
 

7.లేటు వయసులో తండ్రి కాబోతున్న యూకే ప్రధాని

Telugu Canada, Delta, Indians, Latest Nri, Nri, Nri Telugu, Pegases, Telugu Nri,

  యూకే ప్రధాని బోరిక్ జాన్సన్ , అతని భార్య క్యారీ జాన్సన్ మరో బిడ్డకు జన్మను ఇవ్వనున్నారు.‘ మరోసారి ప్రెగ్నెనెంట్ అయినందుకు సంతోషంగా ఉంది అంటూనే ఈ మూమెంట్ కాస్త భయం కూడా కలిగిస్తోంది అంటూ అనే ఇన్స్టి గ్రామ్ లో పోస్ట్ చేశారు.
 

8.భారీగా కరుగుతున్న మంచు

Telugu Canada, Delta, Indians, Latest Nri, Nri, Nri Telugu, Pegases, Telugu Nri,

  గ్రీన్ లాండ్ లో మంచు చాలా వేగంగా, భారీగా జరుగుతోంది.ఒక్క వారంలో కరిగిన మంచే అమెరికా రాష్ట్రం ఫ్లోరిడా ను 2 అంగుళాల నీటిలో ముంచేయగలదు అని డానిష్ ప్రభుత్వ పరిశోధకులు చెప్పారు.
 

9.టోక్యో లో కరోనా కలకలం

Telugu Canada, Delta, Indians, Latest Nri, Nri, Nri Telugu, Pegases, Telugu Nri,

  ఒలంపిక్ నగరం టోక్యో లో రికార్డు స్థాయి లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.తాజాగా ఇక్కడ కొత్తగా నాలుగు వేల పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
 

10.డెల్టా వేరియంట్ నిరోధానికి చర్యలు

  డెల్టా వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు సీరియస్ గా యాక్షన్ ప్లాన్ లోకి దిగక పోతే ఇప్పుడు వరకు పడిన శ్రమ అంతా వృధా అవుతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube