తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ రౌండ్

1.అంతరిక్ష యాత్ర కు టికెట్ల విక్రయం ప్రారంభం

Telugu Abu Dhabi, Britain, Canada, Green Cards, India, India Abu Dhabi, Indians,

  అంతరిక్ష యాత్ర చేపట్టాలని ఉత్సాహం ఉన్న వారికి వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ వారి కోరికను చచ్చిపోతుంది.స్పేస్ గెలాక్టిక్ విమాన టిక్కెట్ల విక్రయాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్ ప్రారంభించారు.టికెట్ ధర 450, 000 డాలర్లు గా నిర్ణయించారు. 

2.నింగిలోకి జీఎస్ ఎల్వి – ఎఫ్ 10

  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జీఎస్ ఎల్వి – ఎఫ్ 10 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు ప్రారంభించింది.ఈ నెల 12న శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి దీనిని ప్రయోగించినట్లు ఇస్రో ప్రకటించింది.
 

3.పాక్ మాజీ ప్రధానిని వెళ్ళిపోమన్న బ్రిటన్

Telugu Abu Dhabi, Britain, Canada, Green Cards, India, India Abu Dhabi, Indians,

  పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బ్రిటన్ షాకిచ్చింది.వీసా పొడిగింపు కోసం ఆయన చేసుకున్న దరఖాస్తులను యూకే హోమ్ ఆఫీస్ తిరస్కరించింది.నవాజ్ షరీఫ్ బ్రిటన్ విడిచి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది.
 

4.డెల్టా వైరస్… 135 దేశాలకు వ్యాప్తి

  కరోనా కొత్త వేరియంట్లలో డెల్టా రకం అత్యంత ప్రమాదకరంగా మారింది.ఇప్పటికే ఈ వైరస్ 135 దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
 

5.అమెరికా గ్రీన్ కార్డుల  జాప్యం.భారతీయుల అసంతృప్తి

Telugu Abu Dhabi, Britain, Canada, Green Cards, India, India Abu Dhabi, Indians,

  అమెరికాలో గ్రీన్ కార్డుల జారీ వ్యవహారంలో చోటుచేసుకుంటున్న జాప్యం కారణంగా విదేశీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సంవత్సరం సుమారు లక్ష గ్రీన్ కార్డులు వృధా కానున్నాయని సమాచారం.గ్రీన్ కార్డును అమెరికన్ ఇమిగ్రేషన్ వ్యవస్థ కంట్రీ క్యాప్ ( దేశాల వారీ కోటా ) ఆధారంగా జారీ చేస్తుండడం తో అమెరికాలో ఉన్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 

6.సిడ్నీలో డెల్టా వేరియంట్ కలకలం

  ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కొత్త కేసులు ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది.ఆరు వారాల కఠిన లాక్ డౌన్ తర్వాత కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది.
 

7.భారత్ నుంచి అబుదాబి కి పెరిగిన విమానాలు

Telugu Abu Dhabi, Britain, Canada, Green Cards, India, India Abu Dhabi, Indians,

  యూఏఈ వెళ్లాలనుకుంటున్న భారతీయుల కు ఆగస్టు 7 నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన నేషనల్ క్యారియర్ ఎథిహాధ్ ఎయిర్ వేస్ భారత్ లోని మూడు నగరాల నుంచి అబుదాబి కి మరిన్ని విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది.  ఆగస్ట్10 నుంచి ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
 

8.మిస్సయిన మద్యం బాటిల్… అమెరికా సీరియస్

  బాటిల్ కనిపించకుండా పోవడానికి అమెరికా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.అయితే ఇది ఆషామాషీ మద్యం బాటిల్ కాదు.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians, Start Se-TeluguStop.com

డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న మైక్ పాంపియో కు విదేశీ పర్యటన సందర్భంగా జపాన్ ప్రభుత్వ అధికారులు 5800 విలువ చేసే ఓ మద్యం బాటిల్ ను గిఫ్ట్ గా ఇచ్చారు.అది కనిపించకుండా పోవడంతో ఇప్పుడు అమెరికా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
 

9.సౌదీ తో భారత్ ఎయిర్ బబూల్ ఒప్పందం

Telugu Abu Dhabi, Britain, Canada, Green Cards, India, India Abu Dhabi, Indians,

ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకోవడం కోసం జరుగుతున్న చర్చలు ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది.త్వరలోనే సౌదీ భారత్ మధ్య ఒప్పందం కుదురుతుందని కేంద్రమంత్రి మురళీధరన్ పార్లమెంట్ లో వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube