తెలుగు ఎన్ఆర్ఐ డైలీ రౌండప్ 

1.కెనడా శుభవార్త .ఆనందంలో భారతీయులు

  వలసదారులు నుంచి అదే పనిగా విజ్ఞప్తులు వస్తున్న క్రమంలో కెనడా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.కెనడాలో స్థిరపడినవారు విదేశాల్లో ఉన్న తమ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ను తమతో ఉంచుకునేందుకు, అటువంటివారు కెనడా వచ్చేందుకు ఏటా కేవలం పది వేల మందికి మాత్రమే అవకాశం ఉండేది.అయితే ఆ నిబంధన ను 40 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం తో కెనడాలో ఎక్కువగా స్థిరపడిన భారతీయులు ఈ కొత్త నిబంధన పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 

2.అమెరికాను దడ దడ లాడిస్తున్న డెల్టా

Telugu Delta, Gabriel, Golden Visa, Joe Biden, Nri, Nri Telugu, Primescott, Telu

కరణం మొదటి వేవ్ లో తీవ్రంగా ఇబ్బంది పడినా, సెకండ్ వేవ్ లో కాస్త ఊరట పొందిన అమెరికాకు ఇప్పుడు డెల్టా వైరస్ భయం పట్టుకుంది.డెల్టా వైరస్ ప్రభావం అమెరికాలో ఎక్కువగా ఉంటుంది అంటూ అమెరికా అంటువ్యాధులు నిపుణుడు ఆంటోనీ పాచి హెచ్చరిక చేయడంతో అమెరికా అప్రమత్తం అయింది.స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తో పాటు, ప్రముఖులంతా డెల్టా వైరస్ పై ప్రజలను చైతన్యవంతం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ వైరస్ సోకుతూ ఉండడం మరింత కంగారు పుట్టిస్తోంది.
 

3.కాలిఫోర్నియా లో వైఎస్సార్ జయంతి వేడుకలు

  అమెరికాలో కాలిఫోర్నియా , బే ఏరియా లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72 వ జయంతి వేడుకలు జరిగాయి.
 

4.యూరప్ లో ‘ వీధి అరుగు ‘ సమావేశం

Telugu Delta, Gabriel, Golden Visa, Joe Biden, Nri, Nri Telugu, Primescott, Telu

  ఆధునిక జీవన విధానం – ఆయుర్వేదం పాత్రపై వీధి అరుగు ఆధ్వర్యంలో జూలై 25న ఆన్లైన్ లో  భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.యూరప్ లో నివసిస్తున్న తెలుగు వారి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
 

5.‘ తెలంగాణ దళిత బంధు ‘ పై ఎన్నారైల హర్షం

  తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘ దళిత సాధికారిత ‘ పథకానికి సీఎం కేసీఆర్ దళిత బంధు ‘ అని నామకరణం చేయడంపై ఎన్నారై టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం హర్షం వ్యక్తం చేశారు.
 

6.భారత వ్యాపారవేత్తకు గోల్డెన్ వీసా

Telugu Delta, Gabriel, Golden Visa, Joe Biden, Nri, Nri Telugu, Primescott, Telu

  భారత సంతతి వ్యాపారవేత్త సతీష్ జై సింఘానీకి యూఏఈ ప్రభుత్వం తాజాగా గోల్డెన్ వీసా మంజూరు చేసింది.
 

7.అమెరికా జీవన ప్రమాణాలు తగ్గుముఖం

  అమెరికన్ల జీవన ప్రమాణ స్థాయి 2021 లో  1.5 సంవత్సరాలు పడిపోయినట్లు గా యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ( సీడీ సీ ) సర్వే లో తేలింది.
 

8.అమెరికా వైమానిక దాడులు .ఇదే మొదటిసారి

Telugu Delta, Gabriel, Golden Visa, Joe Biden, Nri, Nri Telugu, Primescott, Telu

  అమెరికా అధ్యక్షుడిగా జో బైడన్ అధికారం చేపట్టిన తరువాత తొలిసారి యూఎస్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులు చేసింది.సోమాలియా లోని ఆల్ – శాబాబ్ టెర్రరిస్ట్ లపై ఈ దాడి జరిగింది.
 

9.గూగుల్ మరో కీలక నిర్ణయం

  ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri New, Prime Minister Scott Morri-TeluguStop.com

సెర్చ్ ఇంజన్ లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న పాత సేవలను ఒక్కొక్కటిగా తొలగిస్తోంది.తాజాగా సెర్చ్ ఇంజన్ లో బుక్ మార్క్ ఆప్షన్ ను సెప్టెంబర్ 30 నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది.
 

10.  ఫ్రాన్స్ లో కఠిన ఆంక్షలు

Telugu Delta, Gabriel, Golden Visa, Joe Biden, Nri, Nri Telugu, Primescott, Telu

  ఫ్రాన్స్ లో లో కరుణ వైరస్ నాలుగో దశ ప్రారంభం అయిందని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి గాబ్రియేల్ అట్టల్ ప్రకటించారు.ఈ నేపథ్యంలో తమ దేశంలో కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.కోవిడ్ టీకా వేయించుకున్న వారికి, హెల్త్ పాస్ ఉన్న వారికి మాత్రమే బహిరంగ ప్రదేశాల్లో తిరిగే అవకాశం కల్పించడంతోపాటు, మరెన్నో కఠిన ఆంక్షలను విధించాలని నిర్ణయించుకున్నారు.
 

11.పాక్ లో మాజీ దౌత్యవేత్త కుమార్తె హత్య

  పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త కుమార్తెను కొంతమంది దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు.పాకిస్తాన్కు చెందిన సవుకత్ ముకద్దం గతంలో దక్షిణ కొరియా , కజకిస్తాన్ లకు దౌత్యవేత్తగా పనిచేశారు.
 

12.క్షమాపణలు చెప్పిన ఆస్ట్రేలియా ప్రధాని

Telugu Delta, Gabriel, Golden Visa, Joe Biden, Nri, Nri Telugu, Primescott, Telu

  ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రజలకు క్షమాపణ చెప్పారు.ఆ దేశంలో కరోనా వ్యాక్సిన్ నెమ్మదిగా సాగుతుండడం, సిడ్నీలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రధాని క్షమాపణలు తెలిపారు . 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube