తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

 

1.కువైట్ లో భారత ఎంబసీ కీలక ప్రకటన

 

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్-telugu Nri America News-TeluguStop.com
Telugu American, Boris Johnson, Embassyindia, Mahatma Gandhi, Mauritius Metro, Meat Loaf, Nri Telugu, Sputnik Vaccine, Nri-Telugu NRI

కరోనా వైరస్ విజృంభిస్తున్న  నేపథ్యంలో కువైట్ లోని భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది.ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని  వర్చువల్ గా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
 2.మరిన్ని కొత్త వేరియంట్ లు వచ్చే అవకాశం : డబ్ల్యూహెచ్ వో  ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కరోనా వేరియంట్ లు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ వో ) ప్రకటించింది.
 

3.ఇక మాస్కు తప్పని సరి కాదు : బ్రిటన్

 

బ్రిటన్ లో కరోనా ఆంక్షలను వచ్చే వారం నుంచి సడలిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.దీంతో ఇకపై తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన అవసరం కూడా బ్రిటన్ వాసులకు తప్పనుంది.
 

4.కెనడా అమెరికా సరిహద్దుల్లో నలుగురు భారతీయుల మృతి

 భారతదేశానికి చెందిన నలుగురు వ్యక్తులు కెనడా అమెరికా సరిహద్దు ప్రాంతంలో మృతి చెందినట్లు ఆ దేశ సరిహద్దు అధికారులు గుర్తించారు.వెంటనే భారత విదేశాంగ శాఖకు దీనిపై సమాచారం అందించారు.
 

5.మారిషస్ మెట్రో స్టేషన్ కు మహాత్మా గాంధీ పేరు

 

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్-Telugu NRI America News-తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్-Telugu NRI America News-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu American, Boris Johnson, Embassyindia, Mahatma Gandhi, Mauritius Metro, Meat Loaf, Nri Telugu, Sputnik Vaccine, Nri-Telugu NRI

మారిషస్ ప్రభుత్వంమెట్రో ఎక్స్ ప్రెస్  ప్రాజెక్టుకు భారతదేశం అందించిన మద్దతుకు కృతజ్ఞతగా మహాత్మా గాంధీ కి ఒక ప్రధాన మెట్రో స్టేషన్ ను అంకితం చేసింది.అలాగే ఓ స్టేషన్ కు మహాత్మా గాంధీ పేరు ను పెడుతున్నట్టు మారిషస్ ప్రధాన మంత్రి ప్రవింట్ జుగ్నాథ్ అన్నారు.
 

6.స్పుత్నిక్ టీకా తో ఒమి క్రాన్ నుంచి రక్షణ

  అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ వాక్సిన్ కంటే ఎక్కువగా స్పుత్నిక్ టీకా తీసుకున్న వారిలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
 

7.పశ్చిమ ఘనా లో భారీ పేలుడు .17 మంది మృతి

  పశ్చిమ ఘనాలో భారీ పేలుడు సంభవించింది.ఘనా ప్రాంతం సమీపంలో ట్రక్ , మోటార్ బైక్ ను డీ కొన్న ఘటనలో పేలుడు చోటు చేసుకుంది.ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా, 59 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
 

8.అమెరికన్ ప్రముఖ సింగర్, నటుడు మృతి

  యూఎస్ రాక్ స్టార్ , ప్రముఖ సింగర్ , నటుడు మీట్ లోఫ్ (74) మృతి చెందారు.
 

9.ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ లీడర్ గా ప్రధాని నరేంద్ర మోది

  ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ లీడర్ గా భారత ప్రధాని నరేంద్ర మోది నిలిచారు.ఈ విషయాన్ని డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ మో కన్సల్ట్ ‘ వెల్లడించింది.

         

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube