బిగ్ బాస్ హౌస్ లో క్యాస్టింగ్ కౌచ్ సమస్యను నేను ఎదుర్కోలేదు...

తెలుగులో ఒకప్పుడు ప్రముఖ వార్తా ఛానల్ అయినటువంటి v6 ఛానల్ లో తీన్మార్ వార్తల ద్వారా తెలంగాణ యాసలో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన “యాంకర్ శివ జ్యోతి” గురించి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే శివ జ్యోతి తెలుగులో మంచి ప్రాచుర్యం పొందిన ప్రముఖ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Telugu News Anchor Shiva Jyothi React About Casting Couch Issue In Big Boss Cont-TeluguStop.com

అయితే తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ పాల్గొని బిగ్ బాస్ హౌస్ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

 అయితే ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా  అవకాశం రావాలంటే కమిట్మెంట్  ఇవ్వాలని బయట ప్రచారం జరుగుతోందని ఈ విషయంపై మీ స్పందన ఏమిటని  ప్రశ్నించాడు.

 దీంతో ఈ విషయంపై శివ జ్యోతి స్పందిస్తూ ఈ కమిట్మెంట్ సంఘటన ఇతర కంటెస్టెంట్ల విషయంలో జరిగిందో లేదో తనకు తెలియదని కానీ తన విషయంలో మాత్రం ఎలాంటి కమిట్మెంట్ కి సంబంధించిన విషయాలు చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది.అంతేగాక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సమయంలో  కంటెస్టెంట్లకి షో నిర్వాహకులతో ఎలాంటి సంబంధం ఉండదని కేవలం ఇతర కంటెస్టెంట్లు మాత్రమే తమతో పాటు బిగ్ బాస్ హోస్ లో ఉంటారని తెలిపింది.

అలాగే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు రోజులో ఎక్కువ సేపు మేల్కొనే ఉండాలని అంతేగాక ఆహార పదార్థాల విషయంలో కూడా షో నిర్వాహకులు చాల జాగ్రత్తలు పాటిస్తారని చెప్పుకొచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శివ జ్యోతి తెలుగులో ప్రముఖ వార్త ఛానల్ అయినటువంటి టీవీ9 లో న్యూస్ యాంకర్ గా పని చేస్తోంది.

 మరోపక్క యూట్యూబ్ లో పల్లెటూరు వీడియోలు చేస్తూ బాగానే ప్రేక్షకులను అలరిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube