ఎన్టీఆర్ కొత్త కారు ధర ఎంతో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో హీరోలకు సినిమా విషయంలోనే కాకుండా తమ నిత్యవసర విషయాలలో కూడా బాగా ఆసక్తి చూపిస్తుంటారు.వాళ్ళు ఉండే ఇంటి నుండి వాళ్ళు వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా ఎంతో ఖరీదైన ధరలలో ఉంటాయి.

 Telugu Actor Junior Ntr New Car Spotted At Ram Charan House,  Tollywood Latest N-TeluguStop.com

ఇక తమ వాహనాల విషయాలకొస్తే మార్కెట్లోకి ఏవైనా కొత్త మోడల్ కార్లు, బైకులు వస్తే చాలు వాటికి వెంటనే కొనుగోలు చేసే దాకా ఆగరు.ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల దగ్గర ఖరీదైన వాహనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ మరో కొత్త కారును కొనుగోలు చేశాడు.

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు.

ఇప్పటికే తన ఖాతాలో పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ఉన్న సంగతి తెలిసిందే.రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇంటికి తన కొత్త కారులో వెళ్లగా అక్కడ ఎన్టీఆర్ అభిమానులు తన కొత్త కారును ఫోన్ లో బంధించారు.ఇక ఆ కారు నారింజ రంగులో స్టైల్ గా కనిపించగా ఈ కారు లంబోర్గినీ కంపెనీకి చెందిన లేటెస్ట్ మోడల్ అని తెలుస్తుంది.

Telugu Koratala Siva, Ntr Latest, Ntr Car, Rajamouli, Ram Charan, Car, Trivikram

ఈ కారు ధర కొన్ని కోట్లలో ఉంటుందని సమాచారం.ఇక ఈ కారు ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారగా తెగ లైక్ చేస్తున్నారు.ఇక ఇది వరకే ఈయన దగ్గర 2 కోట్లకు పైగా పోర్షే కారు ఉంది.

ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ సినిమాకు ఓకే చేసాడు.

అంతేకాకుండా ఆ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు‘ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

Telugu Koratala Siva, Ntr Latest, Ntr Car, Rajamouli, Ram Charan, Car, Trivikram

ఇక ఈ సినిమా తర్వాత మరో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు.ఇక కొరటాల శివ దర్శకత్వంలో కూడా మరో సినిమా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా గురించి పలు అప్ డేట్ లు కూడా వినిపిస్తున్నాయి.

ఇక ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా ఉన్నట్లు తెలియగా.త్వరలోనే బుల్లితెరపై ఓ రియాలిటీ షో తో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube