సిరి హన్మంతును ఏడిపించిన షణ్ముఖ్ జశ్వంత్.. ఇంట్రస్ట్ లేదని చెబుతూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్ లో ఏదో ఒక జోడీని టార్గెట్ చేసి వాళ్ల మధ్య ఏదో ఉందనే విధంగా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రచారం చేస్తారనే సంగతి తెలిసిందే.గత సీజన్ లో అభిజిత్, హారిక మధ్య ఏమీ లేకపోయినా బిగ్ బాస్ హౌస్ లో వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా ప్రచారం చేశారు.

 Telugu New Bigg Boss Promo Goes Viral In Social Media-TeluguStop.com

మూడు వారాల క్రితం మొదలైన బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ వెరిటీ టాస్క్ లు ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ​సంగతి తెలిసిందే.

నాగారున హొస్ట్ గా ప్రసారమవుతున్న ఈ షోలో తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజైంది.

 Telugu New Bigg Boss Promo Goes Viral In Social Media-సిరి హన్మంతును ఏడిపించిన షణ్ముఖ్ జశ్వంత్.. ఇంట్రస్ట్ లేదని చెబుతూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ప్రోమోలో బిగ్ బాస్ స్విమ్ జర స్విమ్ పేరుతో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు.టాస్క్ లో స్విమ్మింగ్ పూల్ లో ఉన్న లెటర్స్ ను తెచ్చి “captaincy” అనే వర్డ్ ను సెట్ చేయాల్సి ఉంటుంది.

షణ్ముఖ్ సిరికి దూరంగా ఉండాలని భావించగా సిరి మాత్రం షణ్ముఖ్ తో ఫ్రెండ్ షిప్ ను కొనసాగించాలని భావిస్తోంది.సిరి షణ్ముఖ్ ను తనతో ఎందుకు మాట్లాడవని ప్రశ్నిస్తోంది.

సిరి షణ్ముఖ్ తో మాట్లాడుతూ షణ్ముఖ్ తిట్టినా తనకు సంతోషం అని చెబుతుంది.

నీ ప్రాబ్లం ఏంటి అని షణ్ముఖ్ సిరిని అడగగా నువ్వు మాట్లడకపోతే నేను ఒంటరిగా ఫీలవుతున్నా అని సిరి చెబుతుంది.లోన్లీగా ఫీలవ్వు అని షణ్ముఖ్ సిరికి సమాధానం ఇస్తాడు.ఆ తర్వాత తనకు ఇంట్రెస్ట్ లేదని సిరికి చెప్పాలని జశ్వంత్ కు షణ్ముఖ్ చెప్పడంతో సిరి ఫీల్ అవుతుంది.

అయినప్పటికీ నవ్వుతూ నేనేమైనా గర్ల్ ఫ్రెండ్ నా ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి? అని సిరి అడగగా నాకు ఫ్రెండ్ షిప్ కు కూడా ఇంట్రెస్ట్ లేదని వెళ్లిపోవాలని షణ్ముఖ్ చెబుతాడు.ఆ తర్వాత సిరి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

#Siri Hanumanthu #Promo #BiggBoss #Bigg Boss Show #Siri Hanumantu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు