తెలుగు సినిమాలకి నాలుగు నేషనల్ అవార్డ్స్

జాతీయ అవార్డుల రేసులో తెలుగు సినిమాకి మరోసారి గౌరవం దక్కింది.నేషనల్ అవార్డులలో తెలుగు సినిమాని చిన్న చూపు చూస్తారని, మంచి సినిమాలు వచ్చిన వాటిని గుర్తించరని విమర్శలు ఉండేవి.

 Telugu Movies Won 4 National Awards, Maharshi Movie, Jersey Movie, Hero Nani, Su-TeluguStop.com

అందుకు తగ్గట్లుగానే గతంలో చిన్న సినిమాలకి మాత్రమే ప్రాంతీయ ఉత్తమ చిత్రాల కేటగిరీలో అవార్డులు వచ్చేవి.అయితే మహానటి సినిమాతో మొదటిసారి ఒక హీరోయిన్ చాలా కాలం తర్వాత ఉత్తమ నటి అవార్డుని అందుకుంది.

ఆ సినిమాలో చాలా విభాగాలలో అవార్డులు వచ్చాయి.అప్పటి నుంచి ప్రతి ఏడాది తెలుగు సినిమాలకి జాతీయ అవార్డుల వేడుకలో సముచిత స్థానం లభిస్తూ ఉత్తమ చిత్రాల కేటగిరీతో పాటు ఇతర విభాగాలో కూడా అవార్డులు లభిస్తున్నాయి.

67వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహర్షికి, ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ మూవీకి అవార్డులు వచ్చాయి.అలాగే జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా మహర్షి సినిమాకి గాను రాజాసుందరం మాస్టర్ కి అవార్డు లభించింది.

అలాగే ఉత్తమ ఎడిటర్ గా జెర్సీ సినిమాకి ఎడిటింగ్ చేసిన నవీన్ నూలీకి అవార్డు లభించింది.ఉత్తమ నిర్మాణ సంస్థగా దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఎంపికైంది.

మొత్తానికి ఈ ఏడాది ఏకంగా ఐదు కేటగిరీలలో తెలుగు సినిమాలకి అవార్డులు లభించడం నిజంగా హర్షించదగ్గ విషయం అని పలువురు ప్రశంసిస్తున్నారు.ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమాకి ఏ కేటగిరీలో కూడా అవార్డు రాకపోవడం కాస్తా నిరాశపరిచే విషయం.

పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో జాతీయ స్థాయి నటులు నటించడంతో పాటు, కనుమరుగైన ఓ స్వాతంత్ర్య సమరయోధుడుని తెరపై ఆవిష్కరించారు.అయినా కూడా సినిమాని అవార్డుల కోసం పరిగణంలోకి తీసుకోకపోవడం గమనార్హం.

ఇదే సమయంలో మలయాళంలో మరక్కర్ సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రం, అలాగే బెస్ట్ కాస్ట్యూమ్స్ గా అవార్డ్ రావడం చూస్తూ ఉంటే ఇందులో రాజకీయ కోణం ఉందేమో అనే అనుమానం కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube