ప్లాప్ సినిమాలు కానీ బుల్లి తెర పైన బ్లాక్ బస్టర్ లు .. థియేటర్ లో ప్లాప్ అయి టీవీ లో హిట్ అయిన తెలుగు సినిమాలు ఇవే...  

Telugu Movies Were Flops At The Box Office Hit On Small Screen-

కొన్ని తెలుగు సినిమాల ట్రైలర్ లు , ఆ సినిమా ప్రీ రిలీజ్ బజ్ లతో ఆ సినిమా పైన అంచనాలు అమాంతం పెరిగిపోతాయి.దానితో అటు హీరోల అభిమానుల్లో ఇటు సాధారణ ప్రేక్షకులలో సినిమా పైన అంచనా పెరిగిపోయి వారు సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని థియేటర్ లకి వచ్చి చూస్తారు.

Telugu Movies Were Flops At The Box Office Hit On Small Screen--Telugu Movies Were Flops At The Box Office Hit On Small Screen-

కొన్ని సినిమాలు వారి అంచనాలను అందుకొని హిట్ టాక్ తెచుకుంటాయి.మరికొన్ని అసలు ప్రేక్షకుడు ఊహించుకున్నంత బొమ్మ అక్కడ ఉండకపోవడం తో ప్లాప్ లుగా మిగిలిపోతాయి.అయితే అందులో కొన్ని సినిమాలు టీవీ లలో ప్రసారం చేసినప్పుడు మాత్రం అరే ఇంత మంచి సినిమా ప్లాప్ ఎలా అయింది అని ప్రశ్నలు వేసుకుంటారు అభిమానులు.

Telugu Movies Were Flops At The Box Office Hit On Small Screen--Telugu Movies Were Flops At The Box Office Hit On Small Screen-

అలా థియేటర్ లో ప్లాప్ అయి టీవీ లలో సూపర్ డూపర్ హిట్ అయిన తెలుగు టాప్ సినిమాలు ఇవే.

1)ఓయ్

కొన్నాళ్ళకు టీవీ లో ప్రసారం చేసాక సినిమా చూడని ప్రేక్షకులకి కూడా నచ్చి సినిమా ఎప్పుడు ప్రసారం చేసిన మంచి టిఆర్పీ వస్తుంది.

2)వాసు

కరుణాకరన్ ఈ పేరు చెప్పగానే మనకి పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమా గుర్తుకొస్తుంది.అయితే అప్పట్లో కరుణాకరన్ వెంకటేష్ తో తీసిన ఫ్యామిలీ , లవ్ ఎంటర్టైనర్ చిత్రం వాసు , ఆ సినిమా థియేటర్ లో రిలీజ్ అయి ప్లాప్ గా మిగిలిపోయింది.

కానీ ఆ చిత్రం టీవీ లో ప్రసారం అయిన ప్రతి సారి మంచి టిఆర్పీ వచ్చింది.

3)ఆరంజ్

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ , జెనీలియా నటించిన ఆరంజ్ సినిమా రామ్ చరణ్ కి మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత రిలీజ్ అయిన సినిమా , ప్రేక్షకులు రామ్ చరణ్ ని మగధీర తరువాత వెంటనే అటువంటి పాత్రలో చూడలేకపోయారు.దీనితో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ప్లాప్ గా మిగిలింది.కానీ ఇప్పుడు ఆరంజ్ సినిమాని రామ్ చరణ్ కెరీర్ లొనే మంచి లవ్ స్టొరీ గా బుల్లితెర ఆడియన్స్ చెపుతున్నారు.

4)తీన్ మార్

పవన్ కళ్యాణ్ , త్రిష కలిసి నటించిన చిత్రం తీన్ మార్ ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన మాటలను అందించారు.అయితే ఈ సినిమా లో కొంచం నార్త్ , ఫారిన్ కల్చర్ కొంచెం ఎక్కువగా చూపించడం స్క్రీన్ ప్లే పొరపట్ల వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లు తెచ్చుకోలేకపాయింది.టీవీ లో ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది.ఇప్పటికి ఈ సినిమా పాటలు వింటే అద్భుతంగా ఉంటాయి.

5)మహేష్ ఖలేజా

అతిధి లాంటి ప్లాప్ సినిమా తరువాత చాలా కాలం గ్యాప్ తీసుకొని మేక్ ఓవర్ మార్చి మహేష్ తీసిన చిత్రం ఖలేజా.ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా పైన ప్రేక్షకుడికి భారీ అంచనాలు ఉండడం తో థియేటర్ లో పెద్దగా ఆడలేదు.

ఈ సినిమా లో మహేష్ కామెడీ టైమింగ్ , త్రివిక్రమ్ మాటలు , మణిశర్మ పాటలు చాలా బాగుంటాయి.బుల్లి తెర పైన ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది.ఈ సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే హిట్ అని మాట్లాడుకుంటున్నారు మహేష్ అభిమానులు.

6)నేనింతే

రవితేజ పూరి కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ నేనింతే ఈ సినిమా ఎక్కువ భాగం కృష్ణ నగర్ లో ఉండే సినిమా లో ఛాన్స్ ల కోసం ప్రయత్నించే ఆర్టిస్ట్ ల గురించే ఉంటుంది.సినిమాలో పూరి మార్క్ డైలాగు లతో పాటు రవితేజ యాక్టింగ్ చాలా బాగుంటాయి.కానీ ఈ సినిమా మంచి మాస్ సినిమా అనుకున్న జనాలు థియేటర్ కి వెళ్లి నిరాశ పడ్డారు.

కానీ టీవీ లలో వచ్చేసరికి సినిమా ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమా ఎందుకు ప్లాప్ అయింది అనుకుంటున్నారు.

7)ఊసరవెల్లి

హీరో ని స్టైలిష్ గా చూపించే డైరెక్టర్ సురేందర్ రెడ్డి .ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఊసరవెల్లి , ఈ సినిమాలో ఎన్టీఆర్ మేక్ ఓవర్ చాలా బాగుంటుంది.

ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై మంచి ఓపెనింగ్ ని రాబట్టుకుంది.కానీ లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది.ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులతో పాటు చాలా మంది కామన్ ఆడియన్స్ కి టీవీ లో ప్రసారం అయినప్పుడు నచ్చేసింది.

ఇప్పటికి ఈ సినిమాకి మంచి టిఆర్పీ లు వస్తున్నాయి.

8)బుజ్జిగాడు

ప్రభాస్ ని కొత్తగా చూపించిన సినిమా బుజ్జిగాడు.ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రభాస్ ని ఫ్యాన్స్ ఎలా చూడలనుకుంటున్నారో అలా చూపించాడు.చెప్పాలంటే ఈ సినిమా తో ప్రభాస్ కి యూత్ లో ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా మిగిలిపోయిన బుల్లి తెర పైన హిట్ అయింది.

9)1 నేనక్కడినేకానీ తెలుగు ఆడియన్స్ ఇప్పటికి గర్వంగా చెప్పుకునే సినిమా 1 నేనొక్కడినే.ఈ సినిమా టీవీ లో వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు టీవీ లకు అతుక్కుపోతుంటారు.

10)అతడు

అతడు సినిమా ప్లాప్ ఏంటి అనుకుంటున్నారా , సినిమా ప్లాప్ కాకున్నా కానీ ఆ సినిమా కంటెంట్ కి భారీ బ్లాక్ బస్టర్ గా నిలవాల్సింది , కానీ అతడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది.ఈ సినిమా మా టీవీ లో ప్రసారం అయిన ప్రతిసారి మంచి టీఆర్పీ లు వస్తున్నాయి.

తెలుగు లో టీవీ లలో ఎక్కువ సార్లు ప్రసారం అయిన చిత్రం కూడా అతడు సినిమానే.ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం మాటల తో పాటు మహేష్ అద్భుతమైన నటన , మణిశర్మ సంగీతం , త్రిష అందం అన్ని కలిపి సినిమాని మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిపింది.

ఇప్పటికి మహేష్ , త్రివిక్రమ్ కలయిన వచ్చిన గొప్ప చిత్రం అతడు.

వీరితో పాటు నాని నటించిన పిల్ల జమిందార్ , పవన్ కళ్యాణ్ బాలు , అల్లు అర్జున్ పరుగు , నాగ చైతన్య జోష్ లాంటి సినిమాలు ప్లాప్ అయినప్పటికీ టీవీ లలో మంచి హిట్ గా మిగిలాయి…