మెగా బ్రదర్స్ తో ఒకే సంవత్సరంలో హిట్ కొట్టిన తెలుగు ఈ డైరెక్టర్ ప్రస్తుతం...

తెలుగులో ఒకప్పుడు ఆయన ఒక ప్రముఖ డైరెక్టర్…  టాలీవుడ్లో స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, డాక్టర్ రాజశేఖర్, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, తదితర హీరోలతో సినిమాలు తీసి ఎక్కువ హిట్ శాతం ఉన్నటువంటి ప్రముఖ సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గురించి సినిమా పరిశ్రమలో తెలియని వారు ఉండరు.అయితే ఒకప్పుడు స్టార్ దర్శకుడిగా పేరు పొందిన దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఉన్నట్లుండి సినిమాలు తీయడం మానేసి తర్వాత చిత్ర పరిశ్రమకి పూర్తిగా దూరమయ్యాడు.

 Telugu Movie Director Muthyala Subbaiah Real Life News, Muthyala Subbaiah, Muthy-TeluguStop.com

తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులు పంచుకున్నారు.

అయితే ఇందులో భాగంగా 1997వ సంవత్సరంలో తాను దర్శకత్వం వహించిన “గోకులంలో సీత” మరియు “హిట్లర్” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాయని తెలిపాడు.

అందువల్ల ఇప్పటికీ చాలా మంది ఇద్దరు మెగా హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ తో హిట్టు కొట్టడం తనకే సాధ్యమైందని అప్పుడప్పుడు కొంత మంది అంటుంటారని చెప్పుకొచ్చాడు.ఇప్పటి మాదిరిగా సంవత్సరాల తరబడి సినిమాలు చేసే అవకాశం అప్పట్లో ఉండేది కాదని ఎంత పెద్ద హీరో అయినా సరే 70 రోజులు లేదా 90 రోజులకు మించి షెడ్యూల్ ఉండేది కాదని తెలిపాడు.

అయితే హిట్లర్ సినిమాలో చిరంజీవి పాత్రకు గాను కేవలం 50 రోజులు మాత్రమే షూటింగ్ చేశామని కూడా చెప్పుకొచ్చాడు.అంతేగాక అప్పట్లో బడ్జెట్ విషయంలో కూడా కొంతమేర నిబంధనలు ఉండేవని కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ బడ్జెట్ విషయంలో కొంతమేర సడలింపులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

అయితే తాను సడన్ గా సినిమాలకి దర్శకత్వం మానేయడానికి వేరే ఇతర కారణాలు ఏవీ లేవని తానే వ్యక్తిగతంగా వయసు మీద పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రముఖ సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తెలుగులో దాదాపుగా 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

 ఇందులో నలభైకి పైగా చిత్రాలు దాదాపుగా సూపర్ హిట్లు గా విజయాలు నమోదు చేశాయి.అయితే ఇందులో పవిత్ర బంధం, హిట్లర్, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం, అన్నయ్య,  తదితర చిత్రాలు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కాగా తెలుగులో చివరగా ఒకప్పటి టాలీవుడ్ హీరో శివాజీ హీరోగా నటించిన “ఆలయం” అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఆ తరువాత సినిమాల నుంచి విరామమం తీసుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube