పవన్ నీచ రాజకీయం..చెక్ పెడుతున్న తెలుగు మీడియా       2018-04-21   00:50:32  IST  Bhanu C

ప్రస్తుత పరిస్థితులలో స్పెషల్ స్టేటస్ గురించి పోరాటం చేయవలసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ విషయాన్ని మరిచి తన కి అన్యాయం జరిగింది నా తల్లిని దూషించారు దానికి మీడియా సంస్థల సహకారం ఉంది అంటూ వ్యాఖ్యలు చేయడం పెద్ద కలకలం సృష్టించింది..ఏకంగా మీడియా అధినేతలపై పవన్ టార్గెట్ చేయడం టీవీ9 , ఆంధ్రజ్యోతి ,టీవీ5 లను పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వాటిని ఎవరూ చూడకండి అంటూ బహిరంగంగా చెప్పడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది దాంతో తెలుగు మీడియా ఛానెల్స్ అన్ని పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్నాయి..

అయితే ఈ క్రమంలోనే పవన్ తీరును ఖండిస్తూ నిన్నరాత్రి టీవీ5 ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టారు పవన్ వ్యవహార శైలి పై తీవ్ర విమర్శలు చేశారు..ఒక భాద్యత గల రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ మీడియా పై చేసిన విమర్సలకి చర్యలు తప్పవు అంటున్నారు..అంతేకాదు ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కు పారిశ్రామిక వేత్త టీవి 9 అధినేత శ్రీని రాజు పవన్ కళ్యాణ్ పై పరువునష్టం దావా వేయబోతున్నట్లు కూడ ఆ ఛానల్ ప్రకటించింది…ఈ విషయానికి సంభందించి ఇప్పటికే పవన్ పై 50 కోట్ల దావాకు సంబంధించి 50 లక్షల స్టాంప్ ఫీజును అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఛానల్ 10 కోట్ల పరువు నష్టం దావాకు సంబంధించి 10 లక్షల స్టాంప్ ఫీజును కట్టి జనసేనాని ఆపి చేస్తూ సివిల్ క్రిమినల్ చర్యల కోసం దావాలు వేసినట్లు సమాచారం అందుతోంది.

అంతేకాదు తెలుగు మీడియా ఛానెల్స్ అన్నీ కూడా ఈ విషయంలో ఒక్క తాటిపై కి వచ్చాయి..పవన్ కళ్యాణ్ పై వ్యూహాత్మక దాడి చేయడానికి సిద్దం అయ్యాయి..అయితే ఇక్కడ అందరూ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే చంద్రబాబు దీక్ష రోజునే పవన్ కళ్యాణ్ నిరసన వ్యక్తం చేయాలా..? టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్త హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ కి వచ్చేటట్టుగా హడావిడి చేయాలా..ఈ విషయం జరిగి చాలా రోజులు అయ్యింది అప్పుడు స్పందించని పవన్ కళ్యాణ్ చంద్రబాబు దీక్షకి మైలేజ్ రాకుండా చేయడానికే ఇదంతా చేస్తున్నాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి..అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు తల్లిని అడ్డం పెట్టుకుని పవన కళ్యాణ్ నీచ రాజకీయాలకి పాల్పడుతున్నాడు అంటూ ఫైర్ అవుతున్నారు..

ఇదిలాఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన సభ్యులతో కలవబోతున్న నేపధ్యంలో పవన్ పై ఈ ప్రముఖ మీడియా సంస్థలు మొదలుపెట్టిన దాడి పై ఎలా స్పందిస్తాడు అన్న విషయమై ఆసక్తి నెలకొని ఉంది..అయితే పవన్ చిన్న విషయాలని పెద్దదిగా చేస్తున్నారు శ్రీ రెడ్డి కూడా పవన్ కి క్షమాపణలు చెప్పింది అలాంటప్పుడు స్పెషల్ స్టేటస్ మీద పెట్టవలసిన శ్రద్ద పవన్ కళ్యాణ్ అనవసర రాద్దాంతం పై పెడుతున్నాడు అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.