తెలుగు వైద్యుడికి అమెరికాలో గుర్తింపు..!!!  

సహజంగా గుండె పోటు ఎందుకు వస్తుంది అంటే కొవ్వు రక్త నాళాలో పేరుకు పోవడం వలన. అయితే ఈ కొవ్వు పేరుకుపోవడం ఎంత మేర అవుతుంది. ఎలాంటి పరిస్థితులో ఉంది అనేది నిర్ధారించుకోవాలి అంటే తప్పకుండా

Telugu Man Dr Anjaneyulu Recognised As A Best Doctor In USA-News Updates Nri Telugu Nri

Telugu Man Dr Anjaneyulu Recognised As A Best Doctor In USA

యాంజియోగ్రామ్‌ చేయాల్సిందే అయితే ఈ పరిశోధన కంటే కూడా మెరుగైన నూతన పరిశోధన ద్వారా కేవలం ఎకోకార్డియోగ్రఫీ తోనే కనుగొనవచ్చు అని చేసి చూపించారు అమెరికాలో స్థిరపడిన ప్రముఖ తెలుగు గుండె వైద్య నిపుణులు ఆంజనేయులు.

గుండె సమస్య రోగికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కేవలం “2డీ ఎకో” పరీక్ష ద్వారానే గుండె రక్తనాళాల్లో పూడికలున్నాయని నిర్ధారణ చేసి చూపించారు.. ఈ విషయంపైనే ఆయన దాదాపు 15 ఏళ్లుగా పరిశోధనలు చేస్తూ వచ్చారు. “2డీ ఎకో”…ద్వారా గుండె వైద్యంపై చేసిన పరిశోధనలు గతంలోనే అమెరికన్‌ మెడికల్‌ జర్నల్స్ లో ప్రచురించ బడ్డాయి.

Telugu Man Dr Anjaneyulu Recognised As A Best Doctor In USA-News Updates Nri Telugu Nri

అయితే ఇప్పుడు ఈ అంశాలు అన్నిటినీ ఒకే చోట చేర్చి ఒక అధ్యాయంగా వైద్య పుస్తకంగా తయారు చేసే అవకాసం ఆయనకీ కలిగింది.. “అడ్వాన్సెస్‌ ఇన్‌ క్లినికల్‌ కార్డియోవ్యాస్కులర్‌ ఇమేజింగ్‌ ఎకోకార్డియోగ్రఫీ అండ్‌ ఇంటర్‌వెన్షన్స్‌” పేరిట అమెరికాలో తీసుకొచ్చిన పుస్తకం తొలి ఎడిషన్‌లో Dr .ఆంజనేయులకు స్థానం కలిపించడం గమనార్హం.