ఆ సినిమా విడుదలైన తరువాత ఈ డైరెక్టర్ ని చంపేస్తారని అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడట...

టాలీవుడ్ లోని చిత్రాలలో ఎన్నో అద్భుతమైన పాటలను రచించి తన పాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత “సిరివెన్నల సీతారామ శాస్త్రి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే గేయ రచయిత సిరివెన్నెల సీతా రామ శాస్త్రి తన అద్భుతమైన రచన ప్రతిభకి సినీ పరిశ్రమలో అందించే పలు అవార్డులను కూడా అందుకున్నాడు.

 Ttelugu Lyric Writer Sirivennela Seetharama Sastry Sensational Comments On Khadg-TeluguStop.com

కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి 2002వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహించిన “ఖడ్గం” చిత్రంపై స్పందిస్తూ వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఇందులో భాగంగా అప్పట్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో జరిగినటువంటి “బాంబు పేలుళ్లు” సంఘటనలో నుంచి ఖడ్గం చిత్రం యొక్క కథ పుట్టిందని అంతేకాక ఈ చిత్రాన్ని విడుదల చేసిన సమయంలో దర్శకుడు “కృష్ణ వంశీ” కొంతకాలం పాటు ఎవరికీ కనిపించకుండా “అండర్ గ్రౌండ్” కి వెళ్ళిపోయాడని తెలియజేశాడు.

అయితే అందుకు గల కారణాలు లేకపోలేదని బాంబు పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కించడం మరియు హిందూ, ముస్లిం మత వర్గాలను ఆధారంగా చేసుకుని సినిమాలోని సన్నివేశాలను మలచడం వంటి కారణాలతో కొందరు దర్శకుడు కృష్ణ వంశీని టార్గెట్ చేశారని అందువల్లనే కొంతకాలం పాటు దర్శకుడు కృష్ణవంశీ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడని తెలిపాడు.

Telugu Khadgam, Krishna Vamshi, Telugulyric, Tollywood, Lyricwriter-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కేవలం పాట రచించడం మాత్రమే కాకుండా అప్పట్లో ప్రముఖ తెలుగు, హిందీ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని… అనే పాట పాడే ప్రభావశీలమయిన పాత్రలో తను వ్రాసి నటించగా, తను వ్రాసిన పాటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం లభించటం విశేషం.అలాగే తెలుగు తమిళం మలయాళం కన్నడ తదితర సినీ పరిశ్రమల నుంచి దాదాపుగా 50కిపైగా అవార్డులను కూడా అందుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube