ప్రేమ విఫలమై జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య....

ప్రస్తుత కాలంలో కొందరు ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం అలాగే ప్రాణాలు తీసుకోవడం వంటి వాటి కారణంగా తమ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు.కాగా తాజాగా ఓ జూనియర్ ఆర్టిస్ట్ ప్రేమలో విఫలమైనందున ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.

 Telugu Junior Artist Commits Suicide For Love Failure, Love Failure, Telugu Juni-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అనురాధ అనే యువతి సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలో పలు చిన్నాచితకా పాత్రల్లో నటిస్తూ తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.

ఈ క్రమంలో సినిమా పరిశ్రమలో పని చేస్తున్న కిరణ్ అనే యువకుడితో ప్రేమలో పడింది.దీంతో కొన్ని రోజుల పాటు ఇద్దరు కష్టసుఖాలు పంచుకుంటూ సహజీవనం కూడా చేసినట్లు తెలుస్తోంది.

కాగా తాజాగా కిరణ్ కి పెళ్లి నిశ్చయం కావడం మరియు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.దాంతో అనురాధ తీవ్ర మనస్తాపానికి గురైంది అంతేకాకుండా కిరణ్ లేనటువంటి జీవితం తనకి వద్దని తన గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.

Telugu Actress Commits, Love Failure, Telugu Artist, Teluguartist, Tollywood-Lat

దీంతో ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.అంతేకాకుండా అనురాధ బంధువులు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు.ఈ క్రమంలో అనురాధ ప్రియుడు కిరణ్ ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.తన నటనా ప్రతిభను నిరూపించుకునే వెండి తెరపై చూసుకోవాలనుకున్న యువ నటి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయిందని అనురాధ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో కొందరు తాత్కాలిక సుఖాలకి అలవాటు పడి ఇతరుల మాన, ప్రాణాలతో ఆడుకుంటున్నారని దాంతో కొందరు ఆత్మహత్యలు శరణ్యంగా భవిస్తూ ప్రాణాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడడం లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube