ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు హీరోలెవరో చెప్పుకోండి చూద్దాం..?

టాలీవుడ్ సినీ పరిశ్రమలో యంగ్ హీరో నాగ చైతన్య అలాగే రానా దగ్గుబాటి హీరోలకు ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ఇందులో రానా దగ్గుబాటి ఇప్పటికే బాహుబలి చిత్రంలో విలన్ పాత్ర పోషించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు.

 అలాగే నాగచైతన్య కూడా ప్రస్తుతం హీరోగా బాగానే రాణిస్తున్నాడు.అయితే తాజాగా ఈ ఇద్దరికీ సంబంధించినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

 ఆ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు రానా దగ్గుబాటి మరియు నాగచైతన్య కలిసి తీయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ బావ బామ్మర్దులు కావడంతో సోషల్ మీడియా మాధ్యమాలలో వీరిద్దరి అభిమానులు ఈ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు.

అంతేగాక దగ్గుబాటి బావతో అక్కినేని చిన్నోడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న  "లవ్ స్టోరీ" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

కాగా రానా దగ్గుబాటి తెలుగులో విరాటపర్వం అనే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అంతేగాక ఇంతకు ముందే రానా దగ్గుబాటి నటించినటువంటి "అరణ్య" అనే చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు