పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన త్రిష... నిజం కాదట....

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమిళ బ్యూటీ త్రిష కృష్ణన్ కి ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే త్రిష తెలుగులో విక్టరీ వెంకటేష్, నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తదితర స్టార్ హీరోల సరసన నటించి బాగానే ఆకట్టుకుంది.

 Telugu Heroine Trisha Pr Team Gives Clarity About Trisha Marriage-TeluguStop.com

కాగా త్రిష నటిగా సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తన వైవాహిక జీవితంలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో కొంతమేర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.కాగా ఆ మధ్య త్రిష చెన్నైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తని పెళ్లి పెళ్లి చేసుకోవాలని నిశ్చితార్థం కూడా చేసుకుంది.

కానీ పలు అనివార్య కారణాల వల్ల ఈ పెళ్లి పెటాకులు అవ్వడంతో మళ్లీ తన సినీ జీవితం పై దృష్టి సారించింది.ఈ క్రమంలో అడపాదడపా చిత్రాలలో నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది.

 Telugu Heroine Trisha Pr Team Gives Clarity About Trisha Marriage-పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన త్రిష… నిజం కాదట….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా త్రిష పెళ్లి పీఠలు ఎక్కబోతోందని వరుడు ముంబైకి చెందిన ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ అనే పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దీంతో తాజాగా త్రిష పెళ్లి వార్తల విషయంపై త్రిష పబ్లిక్ రిలేషన్ టీమ్ సభ్యులు స్పందించారు.

ఇందులో భాగంగా త్రిష ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టి పారేశారు.అంతేకాకుండా ప్రస్తుతం త్రిష తన సినీ జీవితంలో బిజీగా ఉందని స్పష్టం చేశారు.

అంతేకాకుండా నిజానిజాలు తెలుసుకోకుండా సినీ సెలబ్రిటీల గురించి ప్రచారాలు చేయడంవల్ల వారి వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి మరోమారు తప్పుడు కథనాలను ప్రచారం చేయొద్దని హెచ్చరించారు.

కాగా ప్రస్తుతం త్రిష తమిళం, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా నాలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ప్రముఖ దర్శకుడు మణిరత్నం “పోన్నియన్ సెల్వన్” చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే మలయాళ ప్రముఖ హీరో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న “రామ్” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కేరళ పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

#Trisha #TeluguTrisha #Trisha #Trisha #Trisha PR Team

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు