ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ గుర్తు పట్టారా...?

తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన “ఝుమ్మంది నాదం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన యంగ్ బ్యూటీ “తాప్సీ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

 Telugu Heroine Tapsee Childhood Photos Viral-TeluguStop.com

అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తన నటనా ప్రతిభను నిరూపించుకోవటంతో వరసగా సినిమా అవకాశాలు దక్కించుకుని ఒకసారి హీరోయిన్ గా రాణిస్తోంది.దీనికితోడు ఎప్పుడు విభిన్నమైన కథలను ఎంచుటూ ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోతూ ప్రేక్షకులని కట్టిపడేస్తుంది నటి తాప్సీ పన్ను.

అయితే ఈ మధ్యకాలంలో నటి తాప్సీ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.కాగా తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నటి తాప్సీ చిన్నప్పుడు తను చదువుతున్న పాఠశాలలో బహుమతిని గెలుచుకుని అందుకుంటున్న సమయంలో తీసిన ఫోటోలని షేర్ చేసింది.

 Telugu Heroine Tapsee Childhood Photos Viral-ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ గుర్తు పట్టారా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో కొందరు నెటిజనులు ఈ ఫోటోలని ట్రోల్ చేస్తున్నారు.అంతే కాకుండా మరికొందరైతే చిన్నప్పుడు తాప్సీ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Telugu Tapsee, Tapsee Childhood Photos, Telugu Heroine, Telugu Heroine Tapsee Childhood Photos Viral, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి తాప్సీ కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా శాండిల్వుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మల్లువుడ్, తదితర సినీ పరిశ్రమలలో హీరోయిన్ గా నటించి దేశ వ్యాప్తంగా తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.కాగా ప్రస్తుతం తాప్సీ తెలుగులో ఓ ప్రముఖ దర్శకుడు “మిషన్ ఇంపాజిబుల్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

#Tapsee #TeluguTapsee

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు