ఈ ఫొటోలో కనిపిస్తున్న తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తు పట్టండి చూద్దాం...

తెలుగులో ప్రముఖ సీనియర్ నటుడు మరియు నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా నటించిన లెజెండ్ అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.కదా ఈ అమ్మడు ఈ చిత్రంలో నటించడానికంటే ముందుగా గా రెయిన్బో అనే చిత్రంలో నటించింది.

 Telugu Heroine Sonal Chauhan Looks Stunning Yoga Attire. Sonal Chauhan, Telugu H-TeluguStop.com

కానీ రెయిన్బో చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడిని ఎవరూ గుర్తించలేదు.కానీ లెజెండ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ అమ్మడి సినిమా కెరియర్ ఒక్కసారిగా ఊపందుకుంది.

ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ కొంతకాలం పాటు బిజీబిజీగా గడిచింది.

అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.

ఈ క్రమంలో సోనాల్ చౌహాన్ ఆరోగ్యానికి మేలు చేకూర్చేటువంటి యోగాసనాలను గురించి తన అభిమానులకు తెలియజేస్తూ అలాగే తాను యోగ ఆసనాలు వేసే సమయంలో తీసినటువంటి ఫోటోలను కూడా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తోంది.దీంతో తాజాగా ఎల్ హెడ్ స్టాండ్ ఆసనం గురించి తెలియజేస్తూ ఫోటోని షేర్ చేసింది.

అలాగే ఎల్ హెడ్ స్టాండ్ ఆసనం యొక్క ఉపయోగాలను కూడా క్షుణ్ణంగా వివరించింది.దీంతో సోనాల్ చౌహాన్ చేస్తున్నటువంటి ఈ మంచి పనికి కొందరు నెటిజన్లు అభినందిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అవకాశాలపై పెద్దగా దృష్టి సారించడం లేదు.కానీ బాలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది.కాగా ప్రస్తుతం సోనాల్ చౌహాన్ మిస్ మ్యాచ్ ఇండియా అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం.అలాగే లూసి అనే మరో చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube