తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన “అనగనగా ఒక ధీరుడు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ప్రముఖ తమిళ బ్యూటీ “శృతి హాసన్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈ అమ్మడు సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ సొంతంగా తన నటనా ప్రతిభను నిరూపించుకుని అవకాశాలను దక్కించుకుంది.ఈ క్రమంలో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పట్టువిడవకుండా శ్రమించి తన నటనా ప్రతిభను నిరూపించుకుంది.
దీంతో ప్రస్తుతం తమిళం, తెలుగు తదితర సినీ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.
కాగా ఈ మధ్య కాలంలో శృతి హాసన్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.
ఇందులో భాగంగా తాజాగా శృతి హాసన్ చిన్నప్పుడు తాను ఎలా ఉండేదో చెబుతూ ఓ ఫోటోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.అంతేకాకుండా ఈ ఫోటోకి పద్నాలుగేళ్ళ వయసులో తనకి అందం, అభినయం వంటి వాటిపై ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉండేది కాదని, కానీ చాలా హ్యాపీగా ఉండేదని క్యాప్షన్ కూడా పెట్టింది.
దీంతో శృతి హాసన్ ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అలాగే ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా రెండు లక్షల పైచిలుకు లైకులు కామెంట్లు వచ్చాయి.
అంతేకాకుండా కొంత మంది నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ సినిమా అవకాశాల కోసం పలు సర్జరీలు చేయించుకుని శృతి హాసన్ అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇటీవలె శృతిహాసన్ తెలుగులో “వకీల్ సాబ్” అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.కానీ ఈ చిత్రంలో శృతి హాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో కొంతమేర డైరెక్టర్ శ్రీరామ్ వేణుపై శృతి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న “సలార్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
కాగా ఈ చిత్రానికి కేజిఎఫ్ చిత్ర ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.