టాలీవుడ్ లో దాదాపు గా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి హీరోల చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముంబై బ్యూటీ శ్రియ శరణ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా ప్రస్తుతం శ్రియ శరణ్ కి నాలుగు పదుల వయస్సు దగ్గర పడుతున్నప్పటికీ ఇప్పటికీ వన్నె తరగని అందం, అభినయంతో సినీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
కాగా రెండేళ్ల క్రితం రష్యా దేశానికి చెందిన అండ్రీ అనే ప్రముఖ వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది.దీంతో ప్రస్తుతం శ్రియ శరణ్ తన భర్తతో కలిసి రష్యా దేశంలో నివాసం ఉంటోంది.
అయితే ఈ మధ్య కాలంలో శ్రియ శరణ్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.దీంతో అప్పుడప్పుడు పలు ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొన్న సమయంలో తీసినటువంటి ఫోటోలు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో వేడి పెంచేస్తోంది.
అయితే తాజాగా శ్రియ శరణ్ తన భర్త అండ్రీ తో కలిసి తీయించుకున్న ఫోటో ని షేర్ చేసింది.అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా…? ఈ ఫోటోలో శ్రియ శరణ్ మరియు తన భర్త ముద్దు పెట్టుకున్న సమయంలో తీసింది.
అయితే ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది.అంతేగాక ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన నాలుగు రోజుల సమయంలోనే దాదాపుగా 22 లక్షల పైచిలుకు మంది లైక్ చేశారు.
అయితే మరికొంతమంది మాత్రం సెలబ్రిటీ హోదా లో ఉన్నటువంటి శ్రియ శరణ్ తన భర్తతో వ్యక్తిగతంగా ఉంచుకోవాల్సిన ఫోటోలను ఇలా సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.మరి కొంతమంది మాత్రం ఈ ఫొటోలో తప్పేముంది.
అలాగే శ్రీయ ముద్దు పెట్టుకున్నది తన భర్తనే కదా.! అంటున్నారు. మరికొంతమంది అయితే ఈ ఫోటోని వెంటనే తొలగించాలని కూడా కోరుతున్నప్పటికి శ్రియ శరణ్ మాత్రం ఇలాంటి కామెంట్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రియ శరణ్ తెలుగులో నూతన దర్శకురాలు సృజన రావు దర్శకత్వం వహిస్తున్న “గమనం” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.
కాగా ఈ చిత్రంలో శ్రియ శరణ్ చెవుడు కలిగిన మహిళ పాత్రలో కనిపించనుంది.అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది.అంతేకాక ఈ చిత్రం దాదాపుగా నాలుగు భాషలలో విడుదల కానుంది.అయితే తాజాగా శ్రియ శరణ్ తెలుగులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్.ఆర్.ఆర్” చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయంపై చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.