ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ మీకు గుర్తుందా..? ఇప్పుడు పెళ్లి చేసుకుని...

తెలుగులో ప్రముఖ దర్శకుడు మహి రాఘవ దర్శకత్వం వహించిన “విలేజ్ లో వినాయకుడు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైన మలయాళ బ్యూటీ “శరణ్య మోహన్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తన మొదటి చిత్రంతో పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “భీమిలి కబడ్డీ జట్టు” చిత్రంలో నటించి కుర్రకారుని కట్టి పడేసింది.

 Telugu Heroine Saranya Mohan Real Life News, Saranya Mohan, Telugu Heroine, Vill-TeluguStop.com

 దీంతో అప్పట్లో ఈ అమ్మడు ఎంతో మందికి కలల రాణిగా కూడా ఉండేది.

కానీ శరణ్య మోహన్ తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్ గా ఉంటుంది.

అయితే తెలుగులో శరణ్య మోహన్ హీరోయిన్ గా హ్యాపీ హ్యాపీ గా, భీమిలి కబడ్డీ జట్టు, విలేజ్ లో వినాయకుడు, ముద్ర, తదితర చిత్రాలలో హీరోయిన్ పాత్రలో నటించింది.కానీ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “కళ్యాణ్ రామ్ కత్తి” చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.

అయితే వరుస సినిమాలతో కెరియర్ సవ్యంగా సాగిపోతున్న సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇతడు ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నాడు.

ప్రస్తుతం వీరికి అనంత పద్మనాభన్ అరవింద్ మరియు అన్నపూర్ణ అరవింద్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే పెళ్లి చేసుకున్న అనంతరం శరణ్య మోహన్ పూర్తిగా సినిమా పరిశ్రమకు దూరం అయిపోయింది.

ఈ క్రమంలో తన కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తుంది.కానీ చివరగా శరణ్య మోహన్ 2015వ సంవత్సరంలో తెలుగు బాషలో తెరకెక్కిన “ముద్ర” చిత్రంలో నటించింది.

ఆ తర్వాత ఆమెకు ఇప్పటివరకు ఈమె ఎలాంటి సినిమాల్లో నటించ లేదు.అయితే ఇటీవలే శరణ్య మోహన్ కి మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ  నటనపై ఆసక్తి లేకపోవడంతో అందుకు నో చెప్పినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube