ఇక పై అలాంటి పాత్రల్లో నటించినని అంటున్న రష్మి గౌతమ్...

తెలుగులో తన ముద్దు ముద్దు మాటలతో పలురకాల షోలు, ఈవెంట్లలో హోస్ట్ గా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ముద్దుగుమ్మ రష్మి గౌతమ్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఒకపక్క పలు రకాల షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూనే మరో పక్క చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

 Telugu Heroine Rashmi Gautam React About Her Bold Character Movie Offers-TeluguStop.com

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమాజంలో జరుగుతున్న సంఘటనలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

అయితే అప్పట్లో తాను హీరోయిన్ గా నటించినటువంటి “గుంటూరు టాకీస్” చిత్రంపై యాంకర్ రష్మి గౌతమ్ స్పందించింది.

 Telugu Heroine Rashmi Gautam React About Her Bold Character Movie Offers-ఇక పై అలాంటి పాత్రల్లో నటించినని అంటున్న రష్మి గౌతమ్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా తాను గుంటూరు టాకీస్ చిత్రంలో బోల్డ్ గా కనిపించడంతో దర్శక నిర్మాతలు ఇప్పటికీ అలాంటి పాత్రలే తనకి ఆఫర్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.అంతేగాక ఇప్పటికే బోల్డ్ పాత్ర తరహాలో వచ్చినటువంటి పలు అవకాశాలను ఇష్టం లేకపోవడంతో రిజెక్ట్ చేశానని కూడా తెలిపింది.

అయితే ఇక నుంచి తాను కేవలం బోల్డ్ తరహా పాత్రలు మాత్రమే కాకుండా నటనకు మరియు తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి చిత్రాల్లో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.

అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే గుంటూరు టాకీస్ చిత్రంతో మంచి హిట్ అందుకున్నప్పటికి హీరోయిన్ గా మాత్రం అవకాశాలు దక్కించుకోలేక పోయింది.

  ఒకప్పుడు నటన పరంగా సంతృప్తి చెందనప్పుడు కనీసం పారితోషికం విషయంలోనైనా సంతృప్తి చెందాలనే అభిప్రాయంతో ఉన్నటువంటి రష్మి గౌతమ్ ఒక్కసారిగా నటనకి ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడంతో అభిమానులు రష్మి గౌతమ్ ని ట్రోల్స్ చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో ఈ అమ్మడు మరియు సుడిగాలి సుదీర్ ఇద్దరూ కలిసి ఓ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై మాత్రం రష్మి గౌతమ్ స్పందించడం లేదు.

#Rashmi Gautam #Anchor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు