పాపం.. ఈ హీరోయిన్ ని అప్పట్లో ఆ సౌత్ హీరో రూమ్ కి రమ్మని పిలిచి... 

తెలుగులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “రక్త చరిత్ర” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన ముంబై బ్యూటీ “రాధిక ఆప్టే” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే నటన పరంగా తన ప్రతిభను నిరూపించుకోవడంతో వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

 Telugu Heroine Radhika Apte About Star Hero Harassment In Film Industry-TeluguStop.com

దీంతో కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, అంటూ తేడా లేకుండా సినిమా ఆఫర్లు వరించాయి.దాంతో రాధిక ఆప్టే రెమ్యునరేషన్ కూడా దాదాపుగా 2 నుంచి 5 కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటున్నట్లు సమాచారం.

అయితే తాజాగా రాధిక ఆప్టే ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని సినిమా పరిశ్రమలో తన ఎదురాకున్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ విషయంపై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇందులో భాగంగా తాను సౌత్ ఇండియాకి చెందినటువంటి ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో ఓ స్టార్ హీరో తనని ఒంటరిగా గదిలోకి రమ్మని పిలిచాడని, అంతేకాకుండా పరోక్షంగా కమిట్మెంట్ ఇవ్వాలంటూ సూచించాడని దాంతో తాను విషయం అర్థం చేసుకొని చాకచక్యంగా వ్యవహరించి అక్కడినుంచి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది.

 Telugu Heroine Radhika Apte About Star Hero Harassment In Film Industry-పాపం.. ఈ హీరోయిన్ ని అప్పట్లో ఆ సౌత్ హీరో రూమ్ కి రమ్మని పిలిచి… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత మళ్లీ ఆ స్టార్ హీరోతో తానెప్పుడు మాట్లాడలేదని ఒకవేళ తనకి ఎవరి వల్లయినా ఇబ్బంది కలిగితే అలాంటివారిని తక్షణమే దూరంగా ఉంచుతానని, తాను కూడా దూరంగా ఉంటానని తెలిపింది.రాధిక ఆప్టే మాత్రం ఆ హీరో పేరుని మాత్రం బయట పెట్టలేదు.

దీంతో కొందరు నెటిజన్లు తనను లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి ఆ స్టార్ హీరో ఎవరో చెప్పాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో రాధిక ఆప్టే సినిమాల పరంగా కొంత మేర జోరు తగ్గించింది.

ఆ మధ్య బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి హీరోగా నటించిన “రాత్ అకేలా” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.కానీ కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా సినిమా థియేటర్లు మూసివేయడంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు.

కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో రాధిక ఆప్టే తన తదుపరి చిత్రం కథల విషయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేస్తోంది.

#Radhika Apte #SouthFilm #StarHero #TeluguHeroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు