అవకాశాలు లేక సీరియళ్లలో నటించడానికి సిద్దమవుతున్న మహేష్ హీరోయిన్ చెల్లి...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వచ్చీరావడంతోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకొని అనుకోకుండా 1, 2 చిత్రాల్లో నటించి తెరమరుగైన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.అయితే ఇందులో టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన అతిథి అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ ప్రముఖ మోడల్ మరియు నటి అమృత రావు కూడా ఈ కోవకే చెందుతుంది.

 Telugu Heroine Preetika Rao Is Ready For Serials, Preetika Rao, Telugu Heroine,-TeluguStop.com

అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే ప్రిన్స్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో ఎంట్రీ ఇవ్వడంతో సినిమా లైఫ్ టర్న్ అవుతుందని అందరూ అనుకున్నారు.కానీ ఏమైందో ఏమో గానీ దురదృష్టవశాత్తు అమృతా రావు అతిధి చిత్రంలో నటించిన తర్వాత మళ్లీ తెలుగులో హీరోయిన్ గా నటించలేదు.

కానీ బాలీవుడ్లో వరుసగా సినిమా అవకాశాలు రావడంతో ఈ అమ్మడు తెలుగు సినిమా పరిశ్రమను పెద్దగా పట్టించుకోలేదు.

కానీ అమృత రావు తన సోదరి ప్రీతిక రావు 2012 వ సంవత్సరంలో ప్రియుడు అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయం చేసింది.

కాగా ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటించాడు.కానీ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఈ అమ్మడు సినిమా కెరియర్ కూడా ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో ముగిసిపోయింది.అయితే ఈ చిత్రంలో నటించిన తర్వాత ప్రీతిక రావు బాలీవుడ్లో ఓ చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆ చిత్రం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఈ అమ్మడు సినిమా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం సీరియళ్లలో నటించడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.కాగా ఆ మధ్య ప్రీతిక రావు బాలీవుడ్లో మంచి పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్ట షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది.

అయినప్పటికీ ఈ అమ్మడి సినిమా కెరియర్ మాత్రం మారలేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా అమృత రావు ఆ మధ్య థాక్రేయ్ అనే హిందీ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

కానీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈ అమ్మడికి గుర్తింపు రాలేదు.కాగా ప్రస్తుతం అమృత రావు పలు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లో నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube