పవన్ కళ్యాణ్ తో పెళ్లి పై స్పందించిన పూనమ్ కౌర్.... ఇంకా గుడ్ న్యూస్ లేదట...

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో “పంజాబ్ హీరోయిన్” ఎవరనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.అయితే ఇంతకీ విషయం ఏమిటంటే ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరియు నటుడు పోసాని కృష్ణ మురళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ హీరోయిన్ కావాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఓ పంజాబీ యువతిని టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి శారీరకంగా లొంగదీసుకుని ఆమెను గర్భవతిని చేసి చివరికి “5 కోట్ల రూపాయలు” ఇచ్చి ఆ పంజాబ్ హీరోయిన్ నోరు మూయించారని దాంతో ఆ హీరోయిన్ న్యాయం చేయాలంటూ సినీప్రముఖుల వద్దకు వెళ్లినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకపోయిందని దాంతో ఆ హీరోయిన్ కి న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ ని కోరాడు.

 Telugu Heroine Poonam Kaur React About Marriage With Pawan Kalyan, Telugu Heroin-TeluguStop.com

దాంతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పంజాబీ హీరోయిన్ గురించి కొంతమంది నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.ఈ క్రమంలో ఆ పంజాబీ హీరోయిన్ హాలీవుడ్ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ అని కొందరు ప్రచారాలు చేస్తున్నారు.

దీంతో తాజాగా పూనమ్ కౌర్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పూనమ్ కౌర్ ఫోటోపై ఏకంగా ఎనీ గుడ్ న్యూస్ విత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కామెంట్ చేశాడు దీంతో ఈ విషయంపై స్పందిస్తూ మీరందరూ కలసికట్టుగా రాజకీయ లాభం కోసం మరియు మీ స్వప్రయోజనాల కోసం మా ఇద్దరికీ మీడియా లో పెళ్లి చేశారు కదా ప్రస్తుతం ఇంకా ఎలాంటి గుడ్ న్యూస్ లేదని అలాగే ఇలాంటి దిగజారిపోయేటువంటి రాజకీయాలు చేస్తున్న మీరు మగ జాతి వాళ్లేనా అంటూ ఘాటుగా స్పందించింది.

దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అయితే గత కొద్ది కాలంగా నటి పూనమ్ కౌర్ సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇతరులపై పరోక్షంగా కామెంట్లు చేస్తోంది.అందువల్లనే పూనమ్ కౌర్ గురించి కొంత మంది నెటిజన్లు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు.

Telugu Poonam Kaur, Poonamkaur, Posanikrishna, Telugu, Telugupoonam, Tollywood-M

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూనమ్ కౌర్ తమిళ భాషలో ప్రముఖ హీరో హరీష్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న “గెస్ట్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు మొదలై చాలా కాలం అయినప్పటికీ పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోవడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube