చిన్న వయసులో పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తెలుగు హీరోయిన్ ....

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరియు రచయిత చిన్నికృష్ణ దర్శకత్వం వహించిన వీడు తేడా చిత్రం సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరియు కలకత్తా బ్యూటీ పూజ బెనర్జీ తదితరులు నటించారు.

 Telugu Heroine Pooja Banerjee Marriage And Divorce News, Pooja Banerjee, Telugu-TeluguStop.com

అలాగే ప్రముఖ సీనియర్ నటుడు సుమన్, స్వర్గీయ నటుడు ఎమ్మెస్ నారాయణ, షాయాజీ షిండే, అలీ, హేమ, కృష్ణ భగవాన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.ఇప్పటికీ ఈ చిత్రం లోని కామెడీ సన్నివేశాలు యూట్యూబ్ లో బాగానే ట్రెండింగ్ అవుతున్నాయి.

ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన తర్వాత నటి పూజ బెనర్జీ మళ్లీ ఏమైందో ఏమోగాని తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నటించలేదు.దీనికితోడు ఎక్కువగా ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు బెంగాలీ భాషలో రావడంతో తెలుగు సినిమా పరిశ్రమపై పెద్దగా దృష్టి సారించ లేకపోయింది.

అయితే అక్కడ కూడా ఆఫర్ల పరంగా బాగానే రాణిస్తున్నా కూడా ఇప్పటికీ తనకంటూ చెప్పుకోవడానికి సరైన హిట్ లేక పోవడంతో కెరియర్ చాలా చప్పగా సాగుతోంది.

దీంతో ఏడాదికి 1, 2 చిత్రాలలో కనిపిస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.

అయితే నటి పూజా బెనర్జీ కేవలం వెండితెర ప్రేక్షకులను మాత్రమే కాకుండా ప్రముఖ ఛానళ్లలో ప్రసారం అయ్యే పలు హిందీ ధారావాహికలలో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది.అంతే కాకుండా హిందీలో మంచి పాపులార్ అయిన ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ 9వ సీజన్ లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది.

కాగా పూజా బెనర్జీ ఆర్నోయ్ చక్రవర్తి అనే ప్రముఖ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.కానీ ఇటీవలే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారం తో విడాకులు తీసుకున్నారు.

దీంతో అప్పటి నుంచి పూజా బెనర్జీ తన కుటుంబ సభ్యులతో కలిసి కోల్కతాలో నివాసం ఉన్నట్లు సమాచారం.అలాగే ప్రస్తుతం హిందీలో ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ నటిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube