నేను అలాంటి పాత్రలో నటిస్తానంతే... కానీ అలాంటి దాన్ని కాదంటున్న పాయల్ పాప...

తెలుగులో యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటించినటువంటి ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ గురించి తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే హిట్ అందుకున్నప్పటికే తన తదుపరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది.

 Telugu Heroine Payal Rajput Reacts About Her Bold Character Offers-TeluguStop.com

అయితే ప్రస్తుతం  లాక్ డౌన్ కారణంగా షూటింగులు లేకపోవడంతో సోషల్ మీడియా మాధ్యమాలలో తన అభిమానులతో  ముచ్చటిస్తోంది.

అయితే తాజాగా పాయల్ రాజ్ పుత్ అభిమానులతో సరదాగా చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొంది.

 Telugu Heroine Payal Rajput Reacts About Her Bold Character Offers-నేను అలాంటి పాత్రలో నటిస్తానంతే… కానీ అలాంటి దాన్ని కాదంటున్న పాయల్ పాప…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా తన అభిమానులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.ఇందులో భాగంగా ఓ నెటిజన్ మీరు పలు చిత్రాలలో గ్లామర్ మరియు బోల్డ్ తరహా పాత్రలో నటించే ముందు మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకుంటారా.? అంటూ అడిగాడు.దీంతో పాయల్ రాజ్ పుత్ సమాధానం చెబుతూ ఖచ్చితంగా తన చిత్రంలోని పలు సన్నివేశాలు లేదా బోల్డ్ తరహా సీన్ల గురించి తన తల్లిదండ్రులకు ముందే వివరిస్తానని, అంతేకాక తన నటనా జీవితంలో భాగంగానే అలాంటి సన్నివేశాలలో నటిస్తానని కానీ నిజ జీవితంలో మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.

దీంతో కొందరు నెటిజనులు ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.అంతేగాక మరికొంత మంది నెటిజన్లు అయితే ఏకంగా సినీ పరిశ్రమలో ఒక నటిగా అడుగుపెట్టినప్పుడు ఎలాంటి పాత్రలోనైనా సరే నటించి మెప్పించగలిగితే ఖచ్చితంగా నటనా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో నటించినటువంటి విక్టరీ వెంకటేష్ సరసన వెంకీ మామ అనే చిత్రంలో నటించి హిట్ అందుకున్నప్పటికీ  డిస్కో రాజా చిత్ర రూపంలో మరో పరాజయం వెంటాడింది.అయితే తెలుగు లో ప్రస్తుతం ఈ అమ్మడు నరేంద్ర అనే ఓ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

మరోవైపు ఏంజెల్ అనే చిత్రం ద్వారా తమిళ సినీ పరిశ్రమకు కూడా హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.

#Rx #Payal Rajput

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు