నిత్యా మీనన్ ఆ హీరోతో లవ్ లో ఉందటగా...

తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “అలా మొదలైంది” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమై తన అందం అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులను కట్టిపడేసిన మలయాళీ బొద్దుగుమ్మ “నిత్య మీనన్” గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నిత్య మీనన్ ఓవర్ ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరించింది.

 Telugu Heroine Nitya Menon Love Affair News Viral In Social Media, Nitya Menon,-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో నిత్యమీనన్ కొంతమేర సినిమాల కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

కాగా తాజాగా నిత్య మీనన్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే నిత్య మీనన్ కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరోతో ప్రేమలో పడిందని కొందరు నెటిజన్లు తెగ చర్చించు కుంటున్నారు.అంతేకాక ఆ కన్నడ హీరోతో గతంలో నిత్య మీనన్ ఓ సినిమాలో నటించిందని ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్ వినిపిస్తోంది.

కానీ ఆ కన్నడ హీరోకి ఇదివరకే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారట.అయినప్పటికీ నిత్య మీనన్ తో ఆ హీరో సీక్రెట్ డేటింగ్ లో ఉన్నట్లు పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో ఆ కన్నడ హీరో ఎవరు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు.

కానీ ఆ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్య మీనన్ తనకు కాబోయే భర్త గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా తనని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎప్పుడూ గడ్డంతో కనిపించాలని, అలాగే తనని చాలా ప్రేమగా చూసుకోవాలని, అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.కానీ తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరనే విషయం గురించి మాత్రం ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

దీంతో నిత్య మీనన్ ప్రేమ విషయంపై వినిపిస్తున్న వార్తలన్ని గాలి వార్తలని అందులో ఎలాంటి నిజం లేదని కొందరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా నిత్య మీనన్ ప్రస్తుతం తెలుగులో “గమనం” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

కాగా ఈ చిత్రానికి నూతన దర్శకురాలు సృజనా రావు దర్శకత్వం వహిస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.దీంతో తాజాగా నిత్య మీనన్ “కొలంబి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube