తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్న హీరోయిన్ చెల్లెలు..  

Telugu heroine Neha sharma wants to introduce her sister Aisha Sharma as a heroine in Telugu film industry, Neha Sharma, Telugu heroine, Aisha Sharma, Bollywood actress, Sathyameva Jayate, Chirutha - Telugu Aisha Sharma, Bollywood Actress, Chirutha, Neha Sharma, Sathyameva Jayate, Telugu Heroine, Telugu Heroine Neha Sharma Wants To Introduce Her Sister Aisha Sharma As A Heroine In Telugu Film Industry

తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “చిరుత” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే పర్వాలేదనిపించినప్పటికీ ఎందుకో ఎక్కువ కాలం సినిమా పరిశ్రమలో కొనసాగలేక పోయింది.

TeluguStop.com - Telugu Heroine Neha Sharma Wants To Introduce Her Sister Aisha Sharma As A Heroine In Telugu Film Industry

దీంతో బాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది.

దీంతో తాజాగా నేహా శర్మ తన సోదరి అయేషా శర్మ ని తెలుగు సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.

TeluguStop.com - తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్న హీరోయిన్ చెల్లెలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి బాధ్యతలను ఓ టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కి అప్పగించినట్లు సమాచారం.దీంతో అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లో ఈ అయేషా శర్మ టాలీవుడ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించనుంది.

కాగా అయేషా శర్మ బాలీవుడ్ లో ప్రముఖ హీరో జాన్ అబ్రహం హీరోగా నటించిన “సత్యమేవ జయతే” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఈ అమ్మడికి మాత్రం సినిమా అవకాశాలు మాత్రం తెచ్చి పెట్టలేకపోయింది.

అందువల్లనే నేహా శర్మ తన సోదరి అయేషాశర్మని  తెలుగులో స్టార్ హీరోయిన్ చేసేందుకు కష్టపడుతుందని టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నేహా శర్మ ప్రధాన పాత్రలో టైస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం ఈ వెబ్ సీరీస్ ఓటిటి జీ ఫైవ్ లో ప్రసారం అవుతోంది.అలాగే ఇటీవలే నేహ శర్మ ఇక్ సంధు  హుందా సి అనే పంజాబి చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

#Neha Sharma #Chirutha #TeluguHeroine #Aisha Sharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Heroine Neha Sharma Wants To Introduce Her Sister Aisha Sharma As A Heroine In Telugu Film Industry Related Telugu News,Photos/Pics,Images..