అలాంటి పనులు చేస్తూ పోలీసులకు దొరికిపోయిన తెలుగు హీరోయిన్....

సినిమా పరిశ్రమ ఏదైనా క్యాస్టింగ్ కౌచ్ మరియు మాదక ద్రవ్యాల వినియోగం వంటి విషయాలు బాగానే కలకలం రేపుతున్నాయి.గతంలో బాలీవుడ్ మరియు టాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో ఈ డ్రగ్స్ వ్యవహారం కారణంగా చాలా మంది సినిమా సెలబ్రిటీలు సఫర్ అయ్యారు.

 Telugu Heroine Naira Nehal Shah Arrested By Mumbai Police, Telugu Heroine, Naira-TeluguStop.com

అయితే తాజాగా ముంబైలో మరోమారు ఈ మాదక ద్రవ్యాల వినియోగం మరియు సరఫరా కలకలం సృష్టించింది.ఇందులో భాగంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన నటిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Telugu Mumbai, Telugu, Telugunaira-Movie

పూర్తి వివరాల్లోకి వెళితే తాజాగా ముంబై పరిసర ప్రాంతంలో ని ఓ ప్రముఖ హోటల్ లో మాదక ద్రవ్యాల వినియోగం మరియు సరఫరా జరుగుతుందని పోలీసులకు సమాచారం అందడంతో హోటల్ పై రైడ్ చేశారు.అయితే ఇందులో బర్త్ డే పార్టీ జరుపుకుంటుండుగా టాలీవుడ్ హీరోయిన్ నైరా నేహాల్ షాతో పాటు మరికొంతమంది మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.దీంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు.దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా వ్యవహారం కలకలం రేపుతోంది.

అంతే కాకుండా ఈ డ్రగ్స్ వ్యవహారంలో సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా.? అసలు ఈ డ్రగ్స్ పుట్టిన రోజు పార్టీలోకి ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ విషయం ఇలా ఉండగా నైరా నెహాల్ షా తెలుగులో బుర్రకథ, ఇ.ఈ… , తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.దీంతో నైరా నెహాల్ షా గురించి ప్రేక్షకులకి పెద్దగా తెలియదు.మరి అనుకోకుండా ఈ అమ్మడు డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులకు చిక్కడంతో ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న చిత్రాల షూటింగుల పరిస్థితి ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube